ఆల్లు అర్జున్ - అట్లీ.. అప్పుడే డ్యూన్ తో పోలుస్తారెంటీ?
హాలీవుడ్ క్లాసిక్ “డ్యూన్” (DUNE) సినిమా పోస్టర్‌తో ఈ పోస్టర్ తాలూకు ఫ్రేమింగ్, కలర్ టోన్, థీమ్ లుక్స్ చాలా వరకు పోలి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందబోయే భారీ బడ్జెట్ సినిమా అధికారికంగా ఎనౌన్స్ చేసిన నాటి నుంచే ఫ్యాన్స్ లో హై లెవెల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. "AA22 x A6" వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గేర్ అప్ వీడియో ఇప్పటికే 6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఇప్పుడు అదే విషయం ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌పై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. హాలీవుడ్ క్లాసిక్ “డ్యూన్” (DUNE) సినిమా పోస్టర్‌తో ఈ పోస్టర్ తాలూకు ఫ్రేమింగ్, కలర్ టోన్, థీమ్ లుక్స్ చాలా వరకు పోలి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మరోసారి "కాపీ వాదం" చుట్టూ ఈ ప్రాజెక్ట్ చర్చనీయాంశమైంది.
డైరెక్టర్ అట్లీకు గతంలోనూ ఇలాంటి విమర్శలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ‘జవాన్’, ‘బిగిల్’, ‘మెర్సల్’ వంటి సినిమాలపై కూడా కొన్ని పోలికలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే అట్లీ మాత్రం తన స్టైల్‌లోని మాస్ ఎమోషన్ మిస్ కాకుండా కమర్షియల్ పాయింట్స్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. అట్లీ కాపీ చేయడం అనేది తప్పుడు ఆపాదన అని చెబుతుంటారు. ఈసారి కూడా అంతే విధంగా స్పందించే అవకాశం ఉంది.
అయితే, ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదాలపై పెద్దగా స్పందించడం లేదు. బన్నీ అట్లీ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకం, హై రేంజ్ అంచనాలు ఇలా అన్ని కలిపి సినిమాలో ఉన్న పవర్‌ఫుల్ కంటెంట్‌కు ముందు ఇవి చిన్న విషయాలే అనే మైండ్‌సెట్‌తో ఉన్నారు. అంతేకాదు, బన్నీ నటించిన ‘పుష్ప’ అట్లీ డైరెక్ట్ చేసిన ‘జవాన్’ రెండూ పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన విజయం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై బజ్ తారాస్థాయిలో ఉంది.
ఇక ఈ సినిమాలో మాఫియా బ్యాక్‌డ్రాప్ లో అల్లు అర్జున్ ఓ డాన్ పాత్రలో కనిపించనున్నారన్న టాక్ ఉంది. విజువల్స్, గ్రాఫిక్స్, టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా, ఇండియన్ ఫిలిం స్టాండర్డ్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా చూడవచ్చు. అందుకే పోస్టర్ డిజైన్ కూడా అంత ఇంటర్నేషనల్ లుక్‌లో వచ్చిందన్నది మేకర్స్ చెప్పే యాంగిల్ కావచ్చు.
మొత్తానికి బన్నీ అట్లీ ప్రాజెక్ట్ రిలీజ్ కాకముందే వివాదంలో చిక్కినా, దీనికి సంబంధించి ఫ్యాన్స్‌లో మాత్రం ఎలాంటి నెగటివిటీ లేదు. హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్సిపిరేషన్ తీసుకోవడం తప్పు కాదు కానీ కాపీగా మిగిలిపోవడం మాత్రమే తప్పే అవుతుంది. అసలు విషయం తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే.