అట్లీ - అల్లు అర్జున్.. హీరోయిన్ సెట్టయినట్లేనా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో హైప్ తారాస్థాయిలో పెరిగింది.;

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో హైప్ తారాస్థాయిలో పెరిగింది. ఇక బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ సినిమాపై అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం. అయితే ఇది కేవలం ఫిక్షన్ కథ కాకుండా, వినూత్నంగా రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నాడట అట్లీ.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే, ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందనిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం, ఈ సినిమాకు దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని అంటున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందించేందుకు సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది. బన్నీకి ఇది పుష్ప 2 తర్వాతి సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
లేటెస్ట్ గా ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలని మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం. బన్నీ సమంత జంటగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించారు. ఆ తర్వాత సామ్ పుష్పలో ఓ స్పెషల్ సాంగ్‌కల్లో కనిపించింది. కానీ ఈసారి బన్నీ సినిమాలో ఆమెకు ఓ ముఖ్యమైన రోల్ ఇవ్వబోతున్నారట. సమంత ఈ మధ్య యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలు మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర స్టైలిష్‌గా, పవర్ఫుల్ గా ఉండబోతుందట.
అంతేకాదు, కథలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని టాక్. ఆ రోల్ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్‌ను ఎంచుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. బన్నీకి రెండు వేర్వేరు గెటప్పులు ఉండే అవకాశం ఉన్నందున, ఇద్దరు కథానాయికలు అవసరమవుతారని తెలుస్తోంది. కథలో సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఎమోషన్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయని సమాచారం. అట్లీ మాస్ స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూన్‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, కాస్టింగ్, వీఎఫ్‌ఎక్స్ ప్లానింగ్ బిజీగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాలో తన నటనకు మరో మెట్టు వేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ‘పుష్ప 2’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ఈ సినిమాతో ఆ స్థాయిని మించి మరో భారీ హిట్ కోసం వెతుకుతున్నాడు. టైటిల్, మ్యూజిక్ డైరెక్టర్, టెక్నీషియన్‌ల వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అట్లీ బన్నీ సమంత కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026లో భారీగా విడుదల కానుందని సమాచారం.