ఐకాన్ స్టార్.. ఈ లైనప్ తో బాక్సాఫీస్ కు చుక్కలే..

ఇప్పుడు వరుసగా నాలుగు భారీ సినిమాలతో తన ఫ్యూచర్‌ను మరింత స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నాడు.;

Update: 2025-04-08 15:30 GMT
ఐకాన్ స్టార్.. ఈ లైనప్ తో బాక్సాఫీస్ కు చుక్కలే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ప్రస్తుతం పవర్ఫుల్ ట్రాక్ లో ఉంది. పుష్ప 2 బ్లాక్‌బస్టర్ విజయంతో మరింత హైప్‌లో ఉన్న బన్నీ, ఇప్పుడు వరుసగా నాలుగు భారీ సినిమాలతో తన ఫ్యూచర్‌ను మరింత స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నాడు. వీటిలో సైన్స్ ఫిక్షన్, మైతాలజీ, సైకలాజికల్ యాక్షన్ లాంటి విభిన్న కథాంశాలు ఉండడం విశేషం. బన్నీ తన నెక్ట్స్ జర్నీని ఎంత స్ట్రాంగ్‌గా నిర్మించుకుంటున్నాడో ఈ లైనప్ చూస్తేనే అర్థమవుతుంది.

మొదటిగా, ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలు, ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు పని చేస్తున్నారు. బన్నీ - అట్లీ కాంబినేషన్ ఒక స్టైలిష్, యూనివర్సల్ కమర్షియల్ మూవీ అని టాక్. #AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.

ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మైతాలజికల్ డ్రామా చేయబోతున్నాడు బన్నీ. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. సాంప్రదాయ తత్త్వాల్ని ఆధునిక స్టైల్‌తో మిళితం చేస్తూ స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నట్లు టాక్. ఇక బన్నీకి ఇదొక నూతన షేడ్స్ ఉన్న పాత్ర కానుందని సమాచారం. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ #AA23 సినిమాపై ప్రేక్షకుల అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మరొక ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా బన్నీ ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం వంగా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ 2 ఉండే అవకాశాలున్నా, అల్లు అర్జున్ కోసం కూడా ప్రత్యేకంగా ఓ ఇంటెన్స్ స్టోరీ సిద్ధం చేస్తున్నాడట. ఈ కాంబినేషన్ జరిగితే, బన్నీ కెరీర్‌లో మరో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది #AA24 కింద సిద్ధమయ్యే చెందే అవకాశం ఉంది.

ఇక చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కాంబినేషన్ గురించి చెప్పాలి. కొరటాల శివ తో బన్నీ సినిమా చాలా కాలంగా ప్లాన్‌లో ఉంది. దేవర కంటే ముందు నుంచి ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాల వల్ల సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు దేవర 2 తర్వాత కొరటాల ఫ్రీ అవుతారు కాబట్టి, బన్నీ కొరటాల కాంబోకు అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ #AA25 అయ్యే అవకాశం ఉంది.

ఓవర్ ఆల్‌గా చూస్తే అల్లు అర్జున్ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా క్లియర్ గా ఉంది. అట్లీతో సైన్స్ ఫిక్షన్, త్రివిక్రమ్‌తో మైతాలజీ, వంగా తో సైకలాజికల్ యాక్షన్, కొరటాలతో ఇంటెన్స్ సోషియో డ్రామా.. ఇలా ప్రతి జానర్లో ఒక ప్రాజెక్ట్‌ ప్లాన్ చేస్తూ బన్నీ ఓ ఖచ్చితమైన దిశలో ముందుకు వెళ్తున్నాడు. ఈ నాలుగు సినిమాలు కూడా మాస్, క్లాస్, క్రిటిక్స్.. అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతున్నాయన్నది ట్రేడ్ టాక్. ముఖ్యంగా బాక్సాఫీస్ కు రికార్డులతో చుక్కలు చూపించనున్నట్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News