పిక్‌టాక్‌ : జైలు నుంచి బయటకు వస్తున్న బన్నీ

అల్లు అర్జున్‌ విడుదల నేపథ్యంలో జైలు వద్ద భారీ జనసందోహం ఉండటంతో అధికారులు ముందు చూపుతో వెనుక గేటు నుంచి ఆయనను బయటకు పంపించారు.

Update: 2024-12-14 08:42 GMT

సంధ్య థియేటర్‌ సంఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. అరెస్ట్‌ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్‌ మంజూరు అయినప్పటికీ కొన్ని టెక్నికల్‌ ఇష్యూస్ చెప్పి అల్లు అర్జున్‌ను రాత్రి మొత్తం చంచల్‌గూడ జైలు లోనే ఉంచారు. శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో అల్లు అర్జున్‌ను జైలు నుంచి విడుదల చేశారు. అల్లు అర్జున్‌ విడుదల నేపథ్యంలో జైలు వద్ద భారీ జనసందోహం ఉండటంతో అధికారులు ముందు చూపుతో వెనుక గేటు నుంచి ఆయనను బయటకు పంపించారు. మెయిన్‌ గేటు నుంచి లోనికి వెళ్లిన అల్లు అర్జున్‌ వెనుక గేటు నుంచి బయటకు వచ్చాడు.

ఈ కేసులో బెయిల్‌ వచ్చినా రాత్రి మొత్తం జైలులో అల్లు అర్జున్‌ను ఉంచడం పట్ల పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావాలని అల్లు అర్జున్‌ను జైల్లో ఉంచారు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఆ విషయమై న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం అంటూ అల్లు అర్జున్‌ తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే అల్లు అర్జున్‌ చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ లోనికి వెళ్లే సమయంలో ఎలా ఉన్నాడో అదే డ్రెస్‌లో బయటకు వచ్చేప్పుడు ఉన్నారు. అల్లు అర్జున్‌ చాలా స్టైల్‌గా బయటకు వస్తున్నారంటూ ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ను ఒక్క రాత్రి జైల్లో పెట్టి సంతోషిస్తున్న వారికి ఈ స్టైలిష్ వాక్‌ తో తగిన బుద్ది చెప్పాడు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అల్లు అర్జున్‌కి ఎంతో మంది ప్రముఖులు మద్దతుగా నిలిచిన విషయం తెల్సిందే.

అల్లు అర్జున్‌ తాజాగా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. ఆ సినిమా షూటింగ్‌ దాదాపు రెండేళ్లు పట్టింది. సినిమాకి భారీ హైప్ వచ్చింది. సంధ్య థియేటర్‌లో సినిమా ప్రీమియర్‌ షో సందర్భగా తొక్కిసలాట జరిగి రేవతి అనే వివాహిత మృతి చెందింది. ఆమె తనయుడు ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ కేసు విషయంలోనే అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. దేశంలో ఎన్నో చోట్ల తొక్కిసలాట జరిగింది. కానీ ఇలా స్టార్‌ని అరెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం అంటూ పలువురు అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News