మొత్తంగా క్రెడిట్ అంతా కలిపి మైత్రీ ఖాతాలోనే!
అయితే తాజాగా జరిగిన మరో ఈవెంట్ లో ఈ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ తన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కే ఇచ్చేసారు.
అల్లు అర్జున్ సక్సస్ వెనుక సుకుమార్ ఉన్నాడు అన్నది వాస్తవం. ఈ విషయాన్ని బన్నీచాలా సందర్భాల్లో చెప్పాడు. సుకుమార్ లేకపోతే బన్నీ లేడు...స్టైలిస్ స్టార్ లేడు..ఐకాన్ స్టార్ లేడు...జాతీయ అవార్డు లేదు. ఏం లేవని ఎంతో భావోద్వేగానికి గురై మరీ బన్నీ పబ్లిక్ వేదికపై చెప్పాడు. సుకుమార్ క్రియేటివిటీ వల్లే బన్నీ స్టార్ అయ్యాడు. అక్కడ నుంచి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. భవిష్యత్ లో పాన్ వరల్డ్ స్టార్ కూడా సుకుమార్ క్రియేటివిటీతోనే అవు తాడు.
ప్రత్యేకించి 'పుష్ప' సినిమాతో బన్నీ పాన్ ఇండియా మార్కెట్ లో సంచలనంగా మారాడు. రెండు భాగాలు ఎలాంటి విజయం సాధించాయో తెలిసిందే. ఈ సక్సెస్ నేపథ్యంలో క్రెడిట్ అంతా సుకుమార్ దే అని బన్నీ మరోసారి గట్టిగా చెప్పిన సంగతి తెలిసిందే. సందర్భం వచ్చిన ప్రతీసారి ఈ విషయాన్ని బన్నీ చాలా స్ట్రాంగ్ గా పెట్టాడు. కేవలం డబ్బు ఒక్కటే పెడితే? పాన్ ఇండియా స్టార్ కాలేడు. అలాగైతే వందల కోట్లు పెట్టి సినిమాలు తీయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు.
అందుకే తనని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్కరించడంలో? ఒకే ఒక్కడు సుకుమార్ అని గట్టిగా చెప్పాడు. అలా బన్నీ నుంచి క్రిడెట్ అంతా సుకుమార్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా జరిగిన మరో ఈవెంట్ లో ఈ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్ తన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కే ఇచ్చేసారు. తన సక్సెస్ క్రెడిట్ అంతా వారిదే అని సుకుమార్ అన్నారు. ఆ సంస్థలో పనిచేయడం తనకెంతో కంపర్ట్ గా ఉంటుందని..తనకే కాకుండా ఆ సంస్థలో ఎవరికైనా అలాగే ఉంటుందన్నారు. ఆయన అలా అనడానికి ఓ బలమైన కారణం ఉంది. సుకుమార్ ఓ సన్నివేశాన్ని తీయాలంటే రకరకాలుగా ఆలోచిస్తారు. చాలా సీన్లు అలాగేతీస్తుంటారు. ఫైనల్ గా ఓ సీన్ తెర మీద కనిపిస్తుంది.
మిగతాది వృద్ధాగా పోతుంది. అలా తీయడం వల్ల నిర్మాతకు బోలెడంత ఖర్చు అవుతుంది. ఈ విషయంలో మైత్రీ నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అందుకే పుష్ప సహా తన సక్సెస్ క్రెడిట్ అంతా మైత్రీకిచ్చారు. ఆ క్రెడిట్ తీసుకునే విషయంలో మైత్రీ నిర్మాతలు కూడా ఎలాంటి మెహ మాటం పడకుండానే తీసుకున్నారు. చిత్ర యూనిట్ కూడా అందుకు సమర్దించింది. అలాంటి నిర్మాతలు దొరికినప్పుడే? ఏ డైరెక్టర్ అయినా గొప్ప సినిమా తీయగలడు.