పోలీసు విచారణ వేళ బిస్కెట్లు.. డ్రైప్రూట్స్ తిన్న బన్నీ
దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు సాగిన విచారణలో మొత్తంగా మూడుసార్లు విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
బిస్కెట్లు అయితే పోలీసులు అరేంజ్ చేసి ఉంటారని అనుకోవచ్చు. మరి.. డ్రైఫ్రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అల్లు అర్జున్ కోసం పోలీసులే అరేంజ్ చేశారా? అన్న సందేహం కలుగక మానదు. అయితే.. వాస్తవం ఏమంటే.. అల్లు అర్జున్ తిన్న బిస్కెట్లు.. డ్రైఫ్రూట్స్ రెండూ కూడా ఆయన తన వెంట కారులో తెచ్చుకున్నవే తిన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసు వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. సాధారణంగా విచారణ ఎక్కువ సేపు సాగినా.. మధ్యాహ్న వేళలో అయితే లంచ్ కోసం ఫుడ్ తెప్పిస్తుంటారు.
అల్లు అర్జున్ విషయంలో మాత్రం స్నాక్స్ తీసుకుంటారా? అని అడిగిన సందర్భంలో తన వెంట తెచ్చుకున్న బిస్కెట్లు.. డ్రైఫ్రూట్స్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు మాత్రం టీ తెప్పించారని.. వారిచ్చిన టీని అల్లు అర్జున్ తాగినట్లుగా చెబుతున్నారు. విచారణ మధ్యలో దగ్గర దగ్గరమూడుసార్లు మంచినీళ్లు తాగారని.. ఆ వాటర్ కూడా అల్లు అర్జున్ కారు నుంచి తెచ్చినదే కావటం గమనార్హం.
దగ్గర దగ్గర నాలుగు గంటల పాటు సాగిన విచారణలో మొత్తంగా మూడుసార్లు విరామం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విరామ వేళ.. పది నిమిషాల పాటు బ్రేక్ ఉన్నట్లుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. విచారణ నేపథ్యంలో పోలీసులు ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలే ఎక్కువగా అడిగారని.. చాలా తక్కువ ఉప ప్రశ్నలు మాత్రమే పోలీసులు సంధించినట్లుగా తెలుసతోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చారని.. పోలీసులు సైతం అతడ్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ న్యాయవాది సమక్షంలో అడిగిన ప్రశ్నలు.. వీటికి సంబంధించి వీడియోను రికార్డు చేశారు.
విచారణ వివరాల్ని సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి విచారణకు అల్లు అర్జున్ హాజరు కావాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్న వేళ.. ఒక వ్యక్తి తాను లాయర్ అంటూ చిక్కడపల్లి పోలీసుస్టేషన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి.. తాను లాయర్ ను అని.. తానే కేసు వేసినట్లుగా పేర్కొన్నారు. తనను విచారణ జరుగుతున్న గదిలోకి వెళ్లకుండా ఆపివేశారన్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు రావటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. అతన్ని పక్కకు తీసుకెళ్లిపోయారు.