వెకేషన్ కు బన్నీ ఫ్యామిలీ.. షూటింగ్ కంప్లీట్ అయినట్లేనా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమా కోసం మూడేళ్లుగా డేట్స్ కేటాయించేశారు. ఇప్పుడు చివరి దశకు షూటింగ్ చేరుకోగా.. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న మూవీ.. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం కౌంట్ డౌన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
అయితే రీసెంట్ గా అల్లు అర్జున్, మాలీవుడ్ నటుడు ఫహాద్ ఫాజిల్ పై మేకర్స్ కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మూవీలో ఎంతో కీలకమైన ఆ టాకీ పార్ట్ తో షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్లేనని తెలిసింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప.. మిగతా చిత్రీకరణ అంతా పూర్తైనట్లు వినికిడి. వచ్చే నెలలో ఆ పాట కూడా షూట్ చేయనున్నారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ తృప్తి డ్రిమీ.. స్పెషల్ సాంగ్ లో బన్నీతో చిందులేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాంగ్ తప్ప మిగతా షూటింగ్ పార్ట్ పూర్తవడంతో బన్నీ ఇప్పుడు తన ఫ్యామిలీతో చిన్న ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. జులైలో స్పెయిన్ వెళ్లిన అల్లు అర్జున్ కుటుంబం.. తాజాగా మరో ప్లేస్ కు వెళ్లింది. ఈ మేరకు శనివారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బన్నీ ఫ్యామిలీ కనిపించింది. ఫుల్ మేకోవర్ తో ఉన్న బన్నీని చూసేందుకు అక్కడ ఉన్నవారు ఎగబడ్డారు. స్నేహ రెడ్డి, అయాన్, అర్హతో కలిసి బన్నీ.. ఎయిర్ పోర్ట్ లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే సినిమాల పరంగా తీరిక లేకుండా ఉన్నా.. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసే వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. మూవీ షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపినా.. మధ్య మధ్యలో ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్.. ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. అదే సమయంలో పిల్లలతో బన్నీ స్పెండ్ చేసిన మూమెంట్స్ ను స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటోంది. అవి కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి.
ఒక ప్రైవేట్ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన బన్నీ, స్నేహ.. స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అక్కడికి కొన్ని నెలల తర్వాత తమ ఇళ్లలో ప్రేమ విషయాన్ని తెలియజేశారు. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన స్నేహతో 2011 మార్చి 6వ తేదీన వివాహం బంధంలోకి అడుగుపెట్టారు బన్నీ. వారి బంధానికి గుర్తుగా 2014లో అయాన్, 2016లో అర్హ పుట్టారు. ఇప్పుడంతా కలిసి హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.