బ‌న్నీని స‌ర్ ప్రైజ్ చేసిన అజ్ఞాత అభిమాని!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-09-15 15:34 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా విశేషాలు కంటే ఫ్యామిలీ విష‌యాలు..పిల్ల‌ల విష‌యాలు ఎంతో ఓపెన్గా పంచుకుంటారు. అది అభిమానుల‌కు ఎంతో న‌చ్చుతుంది. పిల్ల‌ల‌తో ప్ర‌తీ మూవ్ మెంట్ ఓ అద్భుతం అంటూ బ‌న్నీ చెబుతుంటే? అభిమానుల‌కు ఎంతో సంతోషిస్తారు. అప్పుడ‌ప్పుడు సినిమా విశేషాలు పంచుకుంటారు.

ఈనేప‌థ్యంలో తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ పుస్తకాన్ని గిఫ్ట్గా పంపారంటూ బ‌న్నీ పేర్కొన్నారు.'గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతడి నిజాయితీ, నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్‌ ది బెస్ట్‌' అని పేర్కొన్నారు.

ఈమేరకు ఆ వ్యక్తి పంపిన 'Burned Beneath the Fire of Desire' అనే పుస్తకం ఫొటోను షేర్ చేశారు. దీంతో ఆ బుక్ పంపింది ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు నెట్టింట జ‌రుగుతున్నాయి. మంచి పుస్త‌కం పంపించి పేరు చెప్ప‌కుండా ఉన్నాడు? అంటే అత‌డు బ‌న్నీకి తెలిసిన వ్య‌క్తా? తెలియ‌ని వ్య‌క్తా? అంటూ అన్వేషిస్తున్నారు. బ‌న్నీకి తెలియ‌ని వ్య‌క్తి అయితే అత‌డిని క‌లిసే ప్ర‌య‌త్నంలో భాగంగానైనా త‌న పేరు చెబుతాడ‌ని కొంద‌రు అంటున్నారు.

మ‌రికొంత మంది బ‌న్నీని కేవ‌లం తాను దూరంగా ఉండే అభిమానించే అజ్ఞాత అభిమాని అయి ఉంటాడ‌ని అంటున్నారు. మ‌రి ఆ సంగ‌తేంటో తేలాలి. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప‌-2` షూట్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌నులు పూర్తి చేసి డిసెంబ‌ర్ లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News