ఐకాన్ స్టార్ ని బాలీవుడ్ కి అలా ఎక్కించారు!

దీంతో బ‌న్నీతో బాలీవుడ్ దర్శ‌క‌, నిర్మాత‌లు సినిమాలు చేయ‌డానికి క్యూలో ఉన్నారు.;

Update: 2025-03-17 08:37 GMT

'పుష్ప' విజ‌యంతో బాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ బ్రాండ్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఒక్క బాలీవుడ్ నుంచే వంద‌ల కోట్ల వసూళ్ల‌ను కొల్ల‌గొట్టింది. కంటెంట్ స‌హా బ‌న్నీ మాస్ అప్పిరియ‌న్స్ తోనే ఇది సాధ్య‌మైంది. అలా బాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అంటే అక్క‌డిప్పుడు ఓ సూప‌ర్ స్టార్. అక్క‌డ స్టార్ హీరోల రేంజ్ ని సైతం మించిన న‌టుడిగా మారిపోయాడు. దీంతో బ‌న్నీతో బాలీవుడ్ దర్శ‌క‌, నిర్మాత‌లు సినిమాలు చేయ‌డానికి క్యూలో ఉన్నారు.

బ‌న్నీ ఒకే చెప్పాలే గానీ బ‌డా నిర్మాణ సంస్థ‌లు బాలీవుడ్ కి ఎగ‌రేసు కుపోవాల‌ని చూస్తున్నారు. టాలీవుడ్ న‌టుల ప‌రంగా చూసినా నార్త్ లో నెంబ‌వ‌ర్ వ‌న్? ఎవ‌రంటే బ‌న్నీ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బ‌న్నీ బాలీవుడ్ ఇమేజ్ కి బీజం ఇప్పుడు ప‌డింది కాదు. కొన్నేళ్ల క్రిత‌మే బీజం వేసారు. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన తొలి చిత్రం `గంగోత్రి`. ఆ సినిమా అప్ప‌ట్లోనే హిందీలోకి డ‌బ్బింగ్ చేసి వ‌దిలారు.

ఆ త‌ర్వాత బ‌న్నీ న‌టించిన కొన్ని క్లాసిక్ ల‌వ్ స్టోరీల‌ను కూడా అనువాద రూపంలో బాలీవుడ్ కి తీసుకెళ్లారు. అలా బ‌న్నీ కి బాలీవుడ్ లో బీజం ప‌డింది. అటుపై బ‌న్నీ న‌టించిన `స‌రైనోడు` నార్త్ యూట్యూబ్ ఛాన‌ల్స్ లో పెద్ద సంచ‌ల‌న‌మైంది. 'సరైనోడు' హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది.

300 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించిన మొదటి భారతీయ చిత్రం ఇదే. ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌రే తెలుగు చిత్రం ఆ రికార్డును చేధించ‌లేదు. ఇలా బ‌న్నీ హిందీ మార్కెట్ ను చాప కింద నీరులా చుట్టాడు. 'పుష్ప‌', 'పుష్ప 2' తో మ‌రింత సంచ‌ల‌నమ‌య్యాడు.

Tags:    

Similar News