ఐకాన్ స్టార్.. ఎక్కడా తగ్గేదేలే!
బన్నీ తనదైన మార్కు నటన, డ్యాన్స్, స్టైల్‌తో స్టైలిష్ స్టార్‌గా పేరుతెచ్చుకుని తనకంటూ ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్న ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు. తన పుట్టిన రోజు నేడు.;

ఉలిదెబ్బలు తింటేనే అందమైన శిల్పమవుతుంది. ఎదురు దెబ్బలు తిన్నప్పుడే మనిషి రాటుదేలుతాడు. దెబ్బలకు తట్టుకున్నప్పుడే రాయి రత్నమై మెరుస్తుంది. బన్నీ విషయంలోనూ అక్షరాలా ఇదే జరిగింది. `గంగోత్రి`తో స్టార్ కిడ్‌గా పరిచయమైనా తొలి చిత్రంతో ఆకారం, ముఖకవలికల విషయంలో ట్రోల్‌కు గురి కావడం తెలిసిందే. అయినా ఆ విమర్శలకు కుంగిపోకుండా ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే జేజేలు అందుకోవాలని నిర్ణయించుకున్న బన్నీ తనదైన మార్కు నటన, డ్యాన్స్, స్టైల్‌తో స్టైలిష్ స్టార్‌గా పేరుతెచ్చుకుని తనకంటూ ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్న ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు. తన పుట్టిన రోజు నేడు.
ఒడిదులకులతో కెరీర్ ప్రారంభించినా కాలక్రమేనా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దేశ వ్యాప్తంగా `పుష్ప 2`తో బన్నీ సొంతం చేసుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగా కాంపౌండ్ హీరోగా అరంగేట్రం చేసినా హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని, స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నాడు బన్నీ. `పుష్ప 2`తో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.
స్టైలిష్ స్టార్‌గా ముందు నుంచి పేరున్న అల్లు అర్జున్ `పుష్ప`లో తొలి సారి లుంగీ ధరించిమాసిన బట్టలు, గడ్డం, రఫ్ లుక్‌తో ఊరమాస్ గెటప్‌లో కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అందుకు తగ్గట్టుగానే తనదైన నటనతో పుష్పరాజ్‌గా బన్నీ అద్భుమైన నటనతో ఆకట్టుకుని పెద్దల నుంచి పిల్లల వరకు హాట్ ఫేవరేట్‌గా నిలవడం విశేషం. `పుష్ప 2`తో 1800 కోట్ల క్లబ్‌లో చేరిన బన్నీ టార్గెట్ ఇప్పుడు మారింది. అంతకు మించి అనే స్థాయిలో ఆలోచనలు చేస్తున్న బన్నీ తన తదుపరి చిత్రాలని భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇందు కోసం క్రేజీ డైరెక్టర్లతో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే క్రేజీ లైనప్‌ని ప్లాన్ చేసుకున్న బన్నీ ఒక్కో ప్రాజెక్ట్‌తో వరుసగా ఫ్యాన్స్‌తో పాటు ఇండియన్ సినీ లవర్స్‌ని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. `పుష్ప 3`ని వచ్చే ఏడాది ప్రారంభించనున్న అల్లు అర్జున్ దీనిక ముందు తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ మాగ్నమ్ ఓపస్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. దీన్ని సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ఈ మంగళవారం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బయటికి రాబోతోంది.
ఈ సినిమా బడ్జెట్ కోసం ఏకంగా రూ.600 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిసింది. ముగ్గురు క్రేజీ హీరోయిన్‌లు నటించనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఓ హీరోయిన్‌గా జాన్వీకపూర్ నటించనుందట. ఈ ప్రాజెక్ట్ తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ ఫిల్మ్‌ని చేయబోతున్నాడు. దీని తరువాతే `పుష్ప 3` సెట్స్ పైకి వెళ్లనుందట. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌ని 2028లో రిలీజ్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.