మార్చి ముగింపులో బన్నీ క్లారిటీ ఇచ్చేస్తాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా విషయంలో స్పష్టత లోపించిన సంగతి తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా విషయంలో స్పష్టత లోపించిన సంగతి తెలిసిందే. రేసులో అట్లీ..త్రివిక్రమ్ పోటీ పడటంతో? బన్నీ ముందుగా ఏ డైరెక్టర్ కి డేట్లు ఇస్తాడు? అన్నది చెప్పలేని పరిస్థితి. ఇద్దరు స్టోరీలు సిద్దం చేసుకుని రెడీగా ఉన్నారు. బన్నీ గ్రీన్ సిగ్నెల్ ఇస్తే పట్టాలెక్కించాలని చూస్తున్నారు. కానీ ఆయన నుంచి మాత్రం ఇంత వరకూ సరైన క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో బన్నీ లైనప్ పై మరో నెల రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుందని నిర్మాత బన్నీవాస్ వెల్లడించాడు.
తదుపరి బన్నీ చేసే సినిమాలన్నీ లైన్ గా ఆయనే స్వయంగా వెల్లడిస్తారని తెలిపారు. అందుకు పెద్దగా సమయం కూడా తీసుకోరని అన్నారు. అంటే మార్చి నెల ముగింపు నుంచి ఏప్రిల్ మొదటి వారానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే బన్నీ వాస్ మాటల్ని బట్టి బన్నీ కేవలం ఒక్క ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడని....ఓ ఆర్డర్ ప్రకారం ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తాడని తెలుస్తోంది.
ఇలా క్లారిటీ ఇస్తే ఎలాంటి గందరగోళం ఉండదు. ఏ సినిమా తర్వాత ఎవరి సినిమా ప్రారంభమ వుతుంద న్నది అభిమానులకు ఓఐడియా ఉంటుంది. సోషల్ మీడియాలో అవనసర చర్చకు అవకాశం ఉండదనే బన్నీ ఇలా డిసైడ్ అయినట్లు బన్నీ వాస్ మాటల్ని బట్టి తెలుస్తుంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత బన్నీ తీవ్ర మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. అటుపై పోలీసు కేసు..కోర్టు అంటూ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో `పుష్ప-2` విజయోత్సవాన్ని కూడా బన్నీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల గురించి ఇంకే ఆలోచించగలరు. ఇప్పుడిప్పుడే ఆ పెయిన్ నుంచి బయట పడుతున్నారు. బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అది వేసవి తర్వాతే మొదలయ్యే అవకాశాలున్నాయని సన్నిహితుల సమాచారం.