ఐకాన్ స్టార్ సినిమాలో విల్ స్మిత్ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి చిత్రం ఏడైరెక్ట‌ర్ తో అన్న‌ది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది.;

Update: 2025-03-03 06:45 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌దుప‌రి చిత్రం ఏడైరెక్ట‌ర్ తో అన్న‌ది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వ‌స్తుంది. ముందుగా త్రివిక్ర‌మ్ తో ప‌ట్టాలెక్కిస్తాడా? అట్లీని తెర‌పైకి తెస్తాడా? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతుంది. అయితే నెట్టింట ప్ర‌చారంలో చూస్తే అట్లీ పేరే వినిపిస్తుంది. ముందుగా అట్లీతోనే మొద‌ల‌వు తుందని...2 026 లో గురూజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రో ప్ర‌చారం కూడా తెర‌పైకి వ‌చ్చింది.

ఇందులో ఓ ప్ర‌ధాన పాత్ర కోసం హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ ని తీసుకురావాల‌ని భావించాడుట‌. కానీ విల్ స్మిత్ పారితోషికం చూసి అట్లీ వెన‌క్కి త‌గ్గుతున్న‌ట్లు వినిపిస్తుంది. అయితే అట్లీ విల్ స్మిత్ ని తీసు కొచ్చేంత గొప్ప స్టోరీ సిద్దం చేసాడా? అన్న‌ది పెద్ద డౌట్. ఎందుకంటే అట్లీ సినిమాల‌న్నీ క‌మ‌ర్శియ‌ల్ గానే రెగ్యుల‌ర్ ఫార్మెట్ లో ఉంటాయి. అత‌డి క‌థ‌లేవి గొప్ప‌గా ఉండ‌వు. నేల విడ‌చి సాము చేయ‌వు. హీరో స్టార్ డ‌మ్ ని తెలివిగా స్క్రిప్ట్ లో క‌మ‌ర్శియ‌ల్ లైజ్ చేసి సినిమా తీయ‌డం అన్న‌ది అట్లీకే చెల్లింది.

మ‌రి ఇలాంటి క‌మ‌ర్శియ‌ల్ స్టోరీ ఒక‌వేళ విల్ స్మిత్ వ‌ర‌కూ వెళ్లినా అంగీక‌రిస్తాడా? అన్న‌ది మిలియన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ఈ ఐడియా ఎలా వ‌చ్చిందో? ఆ పెరుమాళ్ల‌కే తెలియాలి. అలాగే ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారుట‌. ఇప్ప‌టికే జాన్వీ తెలుగు సినిమాలు చేస్తోంది. ఈ కోణంలో బ‌న్నీతో ఛాన్స్ వ‌స్తే ఆమె వ‌ద‌లుకునే అవ‌కాశ‌క‌మే లేదు. దీన్ని గొప్ప అవకాశం భావించి అంగీక‌రిస్తుంది.

మ‌రో సినిమాతో డేట్లు క్లాష్ కాకుండా ఉంటే చాలు కాద‌న‌కుండా ఒకే చేస్తుంది. జాన్వీ కాకుండా ఇంకా మ‌రో ముగ్గురు భామ‌ల్ని సైతం స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుందిట‌. అలాగే ఈ సినిమా బ‌డ్జెట్ 600 కోట్లు అని స‌మాచారం. అందులో వంద కోట్లు అట్లీ-బ‌న్నీ పారితోష‌కంగానే పోతుందిట‌. అంటే మిగ‌తా బ‌డ్జెట్ సినిమా నిర్మాణానికి కేటాయిస్తున్న‌ట్లు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో నిర్మాణంలో బ‌న్నీ వాటా దారుడిగా మారాల‌ని చూసినా? ఆ ఛాన్స్ ద‌క్క‌లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News