ఉగాది రోజున సంగతేంటో తేలిపోతుందా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో ఉంటుందా? అట్లీ తో ముందుకెళ్తాడా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో ఉంటుందా? అట్లీ తో ముందుకెళ్తాడా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సందిగ్గతకు తెర పడేదెప్పుడు? అంటే మార్చి 30 వరకూ వెయిట్ చేయాల్సిందేనన్నది తాజా సమాచారం. ఉగాదిని పురస్కరించుకుని బన్నీ తదుపరి చిత్రాలపై ఓ క్లారిటీ ఇస్తాడని సన్నిహితుల సమాచారం.
ఆ రెండు సినిమాల్ని అదే రోజున లాంచ్ చేయాలన్నది బన్నీ ప్లాన్ అట. అటుపై బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎవరు సిద్దంగా ఉంటే వారితో ముందుగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేయడం అన్నది బన్నీతో సాధ్యం కాదు. ఇప్పటి వరకూ ఆయన ఆవిధానంలో ఎప్పుడూ సినిమాలు చేయలేదు. ఈ నేపథ్యంలో బన్నీ తన పాత పద్దతిలో ముందుగా సినిమా పూర్తిచేసిన తర్వాతే రెండవ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడని తెలుస్తోంది.
వీలైనంత వరకూ ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని బలంగా వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కి కూడా ఏడాదికి పైగా సమయం పడుతుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ కావడంతో ? సీజీ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుందంటున్నారు. చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎ లా లేదన్నా ఏడాదిన్నర పడుతుందంటున్నారు.
ఇదంతా నిజమైతే? అట్లీ ఏడాదిన్నర పాటు బన్నీ కోసం క్యూలో ఉంటాడా? అన్నది చెప్పలేం. ఇప్పటికే అట్లీ `జవాన్` రిలీజ్ అయి ఏడాదిన్నర దాటింది. మరో ఏడాదిన్నర వెయిట్ చేయడం అంటే? కష్టమైనే పని. మరేం జరుగుతుందో చూడాలి.