మోస్ట్ వాంటెడ్ ఇండియన్ స్టార్ నెక్ట్స్ ఏంటి?
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బోయ్ అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి.;

టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. దశాబ్ధాల చరిత్రలో ఎవరికీ దక్కని కీర్తి అతడికి దక్కింది. `పుష్ప` చిత్రంతో ఇది సాధ్యమైంది. అతడు నటించిన పుష్ప ఫ్రాంఛైజీ సంచలన విజయం సాధించడమే గాక, పాన్ ఇండియన్ స్టార్ గా అతడి స్థాయిని అమాంతం పెంచింది. నేడు భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ హీరోగా బన్ని స్థానం సుస్థిరమైంది.
అత్యుత్తమ నటన- డ్యాన్సింగ్ సామర్థ్యం, గొప్ప వ్యక్తిగత క్వాలిటీస్ అతడిని ఈ స్థాయికి చేర్చాయి. బహుముఖ ప్రజ్ఞ తో పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా ఎదిగారు. ఒక పాత్రలో నటించడంలో అల్లు అర్జున్ అంకితభావం చొరవ గొప్ప విజయాల్ని అందించాయి. కేవలం అవార్డులు రివార్డులే కాదు.. దేశంలో అసాధారణమైన ఆర్జన ఉన్న స్టార్ గాను సుపరిచితుడు. 2014 నుండి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కూడా చోటు సంపాదించారు.
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బోయ్ అల్లు అర్జున్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి విషెస్ అందుతున్నాయి. 8 ఏప్రిల్ 2025 నాటికి 43 ఏళ్లు నిండుతున్నాయి.
అల్లు అర్జున్ నెక్ట్స్ ఏంటి?
పుష్ప ఫ్రాంఛైజీ నుంచి పుష్ప 3 కోసం సుకుమార్ టీమ్ స్క్రిప్టును రెడీ చేస్తోందని టాక్ ఉంది. సుకుమార్ మినహా అల్లు అర్జున్ మరో ఐదుగురు దర్శకులతో సినిమాలు చేసే వీలుంది. ఇటీవల అట్లీతో ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది. ఆ తర్వాత త్రివిక్రమ్, కొరటాల శివ, సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో బన్ని పని చేసే అవకాశం ఉంది.
జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ భారీ చిత్రాని(అట్లీ 6వ చిత్రం)కి దర్శకత్వం వహించేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రాజెక్ట్ ని లాక్ చేసాడని టాక్ ఉంది. బన్ని ఈ చిత్రంలో తన కెరీర్‌లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుందని తెలుస్తోంది. నేడు బర్త్ డేని పురస్కరించుకుని అప్ డేట్ చెబుతారని ఫ్యాన్స్ వెయిటింగ్.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో AA22 కోసం అల్లు అర్జున్ చాలా కాలంగా చర్చలు సాగిస్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. భారతీయ పురాణేతిహాసాల్లో ఎగ్జయిట్ చేసే కథాంశంతో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ గతంలో హింట్ ఇచ్చారు. కానీ ఇటీవల దీనిపై సరైన అప్ డేట్ లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. బన్ని బర్త్ డే సందర్భంగా కొత్త అప్ డేట్ ఏం చెబుతారో చూడాలి.
కొరటాల శివతో AA21 కోసం ప్రయత్నాలు సాగినా అవేవీ ముందుకు వెళ్లలేదు. కొరటాలతో సినిమా కోసం బన్ని చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ బహుభాషా చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని -గీతా ఆర్ట్స్ నిర్మించాల్సి ఉంది. స్క్రిప్టు ఓకే అయిందా లేదా? అసలు ప్రాజెక్ట్ స్టాటస్ ఏంటో తెలియాల్సి ఉంది. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల స్క్రిప్టు పనుల్లో ఉన్నారని టాక్ ఉంది.
సందీప్ రెడ్డి వంగాతో AA23 తెరకెక్కే ఛాన్సుందని అంచనా. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో `స్పిరిట్` పూర్తి చేసాక అల్లు అర్జున్ తో సినిమా చేసే ఛాన్సుందని సమాచారం. ఈ సినిమా స్క్రిప్టు కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. వంగా సిగ్నేచర్ టచ్‌తో పవర్ ఫుల్ స్టోరీని తెరపైకి తీసుకువస్తారని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించే అవకాశం ఉంది. అంతకుమించి ఎలాంటి అప్‌డేట్ లేదు.