అల్లు అర్జున్ ఛాయిస్ పై డౌట్ పడుతున్నారెందుకు..?
అట్లీ అల్లు అర్జున్ కాంబో లో స్టైలిష్ యాక్షన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తాడని అనుకోగా ఆ ప్రాజెక్ట్ కి కాస్త టైం పట్టేలా ఉందని నెక్స్ట్ మూవీకి ఓకే చెప్పేశాడు అల్లు అర్జున్. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. జవాన్ తో షారుఖ్ తో సెన్సేషనల్ హిత్ అందుకున్న అట్లీ నెక్స్ట్ సినిమా విషయంలో చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నాడు. అసలైతే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలని అనుకోగా అది ఎందుకో ఆగిపోయింది.
అల్లు అర్జున్ అట్లీ మూవీ త్వరలోనే అనౌన్స్ మెంట్ రాబోతుంది. ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. ముఖ్యంగా పుష్ప తో ఎలాగైతే నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాడు కాబట్టి రాబోతున్న సినిమా కూడా అదే రేంజ్ అంచనాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే దానికి మించి అంచనాలు ఉంటాయి. ఐతే అల్లు అర్జున్ అట్లీ సినిమా కు తమిళ యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ తో మ్యూజిక్ డైరెక్షన్ చేయించే ప్లానింగ్ లో ఉన్నారు.
అట్లీ తన ప్రతి సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ తో మ్యూజిక్ కంపోజ్ చేయిస్తాడు. ఐతే ఈసారి కొత్తగా యువ సంగీత దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నాడని టాక్. ఐతే సాయి అభ్యంకర్ తమిళ్ లో ఫోక్ సాంగ్స్ కంపోజ్ చేస్తూ వస్తున్నాడు. మరి అట్లీ అతన్ని ఈ సినిమాకు ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం అతని ఎంపిక రాంగ్ ఛాయిస్ అంటున్నారు. సాయి అభ్యంకర్ మాత్రం తనకు వచ్చిన ఈ ఛాన్స్ ని అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అట్లీ అల్లు అర్జున్ కాంబో లో స్టైలిష్ యాక్షన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఏంటో తెలియదు కానీ అదొక్కటి పక్కన పెడితే ఈ సినిమా పై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. మరి పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమా ఏమేరకు ఇంపాక్ట్ కలిగేలా చేస్తుందో చూడాలి.