సుకుమార్ రెడ్డి.. అల్లు అర్జున్ టంగ్ స్లిప్..!
పుష్ప 2 ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఆ జోష్ లో కాస్త కంగారుగా కనిపిస్తున్నాడు.
పుష్ప 2 ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో అల్లు అర్జున్ ఆ జోష్ లో కాస్త కంగారుగా కనిపిస్తున్నాడు. మొన్న హైదరాబాద్ ప్రెస్ మీట్ లో తెలంగాణా ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయి తడపడ్డ అల్లు అర్జున్ ఏపీ సినిమాటోగ్రాఫర్ పేరు విషయంలో కూడా అదే తప్పు చేశారు. ఇక లేటెస్ట్ గా తనకు 1000 కోట్ల సినిమా అందించిన డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా తప్పుగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా నార్త్ లో అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది. అందుకే దేశ రాజధాని అయిన ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ క్రమంలో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చేస్తున్న వసూళ్ల గురించి మాట్లాడారు. ఆ తర్వాత థాంక్స్ ఇండియా అనుకుంటూ అల్లు అర్జున్ స్పీచ్ మొదలు పెట్టాడు. దేశ రాజధానిలో ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోగా అల్లు అర్జున్ కాస్త టెన్స్ ఫీల్ అవుతున్నాడని అనిపించింది. ఐతే కూల్ గా మ్యానేజ్ చేసినా కూడా లోపల ఏదో తెలియని ఒక బెరుకు కనిపిస్తుంది. ఐతే ఈ హడావిడిలో ప్రెస్ మీట్ లో కాస్త తడపడుతున్నాడు అల్లు అర్జున్.
ముఖ్యంగా తన సినిమా దర్శకుడు సుకుమార్ పేరుని తప్పుగా చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్ పేరుని బండి సుకుమార్ రెడ్డి అని చెప్పాడు అల్లు అర్జున్. సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్ మాత్రమే కానీ సుకుమార్ రెడ్డి అని టంగ్ స్లిప్ అయ్యారు అల్లు అర్జున్. సుకుమార్ పూర్తి పేరు అల్లు అర్జున్ కి తెలిసి ఉండగా అంటే కచ్చితంగా కాదు. సుకుమార్ అనేస్తే ఎలా అనుకున్నాడో ఏమో పూర్తి పేరు చెప్పాలన్న తొందరలో బండ్రెడ్డి సుకుమార్ అనబోయి సుకుమార్ రెడ్డి అనేశాడు.
అలా అల్లు అర్జున్ స్లిప్ అయ్యాడో లేదో ఇలా సోషల్ మీడియాలో ఎటాకింగ్ మొదలైంది. ఐతే కొందరు నిజంగానే సుకుమార్ రెడ్డి నా అంటూ వెతకడం మొదలు పెట్టారు. ఏది ఏమైనా ఇలా నేషనల్ మీడియాలో ప్రెస్ తో మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే బెటర్. అలా కాకపోతే ఒట్టి సుకుమార్ ని సుకుమార్ రెడ్డి చేయాల్సి వస్తుంది. అల్లు అర్జున్ లో ఈ తొందరపాటు ఇదివరకు కూడా చూశాం కానీ ఇప్పుడు పాన్ ఇండియా హిట్ కొట్టిన ఆయన ఇలా మాట్లాడటం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.