వైలెంట్ మేకర్ కు బన్నీ ఫోన్ కాల్!

లేటెస్ట్ మలయాళం చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన వైలెంట్ ఫిల్మ్ మేకర్ ను బన్నీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.

Update: 2025-01-10 06:58 GMT

అల్లు అర్జున్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంటున్నారు. పుష్ప 2 తో 1800 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టిన బన్నీ, తన కెరీర్‌ను మరో రేంజ్ కు తీసుకెళ్లే పనిలో ఉన్నారు.ఈ జర్నీలో అతను టాలెంటెడ్ దర్శకులు, టెక్నీషియన్స్‌తో చర్చలు జరుపుతూ, వారికి ఎల్లప్పుడూ సపోర్ట్‌గా ఉండడం మరొక ఆసక్తికరమైన విషయం. ఇక మలయాళ ఇండస్ట్రీపై ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన అల్లు అర్జున్, అక్కడి టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడం మరో విశేషం.

లేటెస్ట్ మలయాళం చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన వైలెంట్ ఫిల్మ్ మేకర్ ను బన్నీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కో అనే సినిమా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ గా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు హనీఫ్ అదేని పని తీరు, కథనం పట్ల ఓ వర్గం ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. డైరెక్టర్ ఏంటీ మరీ ఇంత వైల్డ్ గా ఉన్నాడనే మీమ్స్ కూడా వస్తున్నాయి.

ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ అతని మేకింగ్ విధానంపై పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు హనీఫ్ కు స్పెషల్ గా ఫోన్ చేసి మరీ అభినందించారట. చిత్రంలో ఉన్న హై ప్రొడక్షన్ వాల్యూస్, కథ బలం అలాగే ఉన్ని ముకుందన్ అదిరిపోయే నటన సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయని చెప్పారని తెలుస్తోంది. ఇక మార్కో చిత్రంలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

ఈ చిత్రంలో మార్కో పీటర్ అనే వ్యక్తిగా తన సోదరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేసాడు, దాని ఆసక్తికరమైన కథన శైలి ప్రేక్షకులను అగ్రెస్సివ్‌గా కుదిపేసింది. హనీఫ్ అదేని దర్శకత్వ ప్రతిభతో తెరకెక్కిన ఈ సినిమా 20 రోజుల్లోనే రూ.55 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టెక్నికల్ విజన్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు అదిరిపోయే అనుభవాన్ని అందించిందనే కామెంట్స్ వస్తున్నాయి.

మలయాళ సినిమా ఇండస్ట్రీలో అద్భుత విజయం సాధించిన ఈ చిత్రంపై బన్నీ చూపిన ఆసక్తి, అభిమానులకు మరింత ముచ్చట కలిగించింది. ఇకపోతే, పుష్ప: ది రైజ్ తో భారీ విజయం అందుకున్న అల్లు అర్జున్, తన తదుపరి చిత్రం కోసం త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఇతర ఇండస్ట్రీల టెక్నీషియన్స్‌ను ప్రోత్సహిస్తూ బన్నీ తన జాతీయ స్థాయి క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ అనంతరం ఐకాన్ స్టార్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే సంజయ్ లీలా భన్సాలితో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్.

Tags:    

Similar News