బన్నీ పొలిటికల్ ఎంట్రీ.. ఓ క్లారిటీ ఇచ్చేసిన అల్లు టీమ్
గత ఎన్నికల్లో బన్నీ సపోర్ట్ గా నిలిచాడు. అయితే అది కాంట్రవర్సీగా మారి మెగా అల్లు ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం క్రియేట్ చేసింది.
సినీ ప్రయాణంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన పుకార్లు ఇటీవల హల్‌చల్ చేస్తున్నాయి. బన్నీకి ఆంద్రప్రదేశ్ లో పొలిటికల్ లీడర్స్ తో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవితో ఎంతో కాలంగా స్నేహం ఉంది. గత ఎన్నికల్లో బన్నీ సపోర్ట్ గా నిలిచాడు. అయితే అది కాంట్రవర్సీగా మారి మెగా అల్లు ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం క్రియేట్ చేసింది.
అయితే బన్నీ ఎన్నడూ మెగా ఫ్యామిలీకి దూరంగా అయితే ఉండలేదు. పవన్ కళ్యాణ్ కోసం చాలాసార్లు అతను నిలబడ్డాడు. ఇక ఇప్పుడు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉండగా పొలిటికల్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా నుండి ప్రధాన మీడియా వరకు ఈ వార్తలు వైరల్ అవుతుండగా, అల్లు అర్జున్ టీమ్ ఓ అధికారిక ప్రకటన జారీ చేసి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.
ప్రకటనలో, "అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి అలాగే వాస్తవం కానివి" అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అంశంపై అవాస్తవాలు ప్రచారం చేయకూడదని, ఖచ్చితమైన సమాచారం కోసం అల్లు అర్జున్ అధికారిక టీమ్ నుండి మాత్రమే విశ్వసించాలని కోరారు. ఇక ఫైనల్ గా ఈ ప్రకటనతో ఆయన అభిమానులు కొంత ఊరట పొందారు.
ఇటీవల వచ్చిన పుష్ప 2 విజయంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ క్రేజ్ పెరిగింది. అలాంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ప్రకటనతో అలాంటి పుకార్లకు జెట్ స్పీడ్ లోనే ఫుల్‌స్టాప్ పెట్టారు. అల్లు అర్జున్ తమ సినీ ప్రయాణంపైనే పూర్తిగా ఫోకస్ సారించారనే సంకేతాలు ఇచ్చారు. ఇక, అల్లు అర్జున్ తన సినిమా కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పుష్ప 2 వెయ్యి కోట్లు అందుకోవడంతో మళ్ళీ ఆడియెన్స్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పేందుకు విజయయాత్ర మొదలు పెట్టారు. పలు నగరాల్లో విజయయాత్ర అనంతరం హైదరాబాద్ లో కూడా భారీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు.
పుష్ప 2 సక్సెల్ పట్ల అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటివరకు రాజమౌళి కూడా టచ్ చేయని ఒక అద్భుతమైన వరల్డ్ ను గ్రాండ్ గా చూపించనున్నట్లు నిర్మాత నగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉంది.