పుష్ప 2 - లేటెస్ట్ లెక్క ఎంతవరకు వెళ్లిందంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ కలెక్షన్స్ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగో వారం పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఐదో వారంలోకి ఈ చిత్రం అడుగుపెట్టింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ ‘పుష్ప 2’ కలెక్షన్స్ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగో వారం పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా ఐదో వారంలోకి ఈ చిత్రం అడుగుపెట్టింది. నార్త్ ఇండియాలో అయితే మూవీకి కలెక్షన్స్ నిలకడగా వస్తున్నాయి. 28వ రోజు కూడా 10 కోట్లకి పైగా వసూళ్లు రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీ కలెక్షన్స్ ని మేకర్స్ తాజాగా ప్రకటించారు.
వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 1799 కోట్లు కలెక్షన్స్ అందుకుందని ప్రకటించారు. ఇంకా థియేటర్స్ లో మూవీ కొనసాగుతూ ఉండటంతో ఈ వసూళ్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ‘బాహుబలి 2’ మూవీ లాంగ్ రన్ లో 1810 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. అంటే ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ ‘బాహుబలి 2’ని క్రాస్ చేయడానికి అడుగుదూరంలో ఉంది.
మరో రెండు రోజుల్లో ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. ఒకవేళ ‘పుష్ప 2’ మూవీ 1810 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేస్తే ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో రెండో స్థానంలోకి ‘పుష్ప 2’ వచ్చేస్తుంది. అయితే మొదటి స్థానంలో ఉన్న ‘దంగల్’ కలెక్షన్స్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేయడం కష్టమని చెప్పాలి.
‘దంగల్’ మూవీ చైనాలో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఈ కారణంగా ఆ మూవీ టాప్ లో నిలిచింది. డొమెస్టిక్ లెక్కల ప్రకారం చూసుకుంటే ‘బాహుబలి 2’ మూవీ మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానాన్ని ‘పుష్ప 2’ ఆక్యుపై చేయడానికి సిద్ధమవుతోంది. ఒక వేళ ఈ రికార్డ్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకున్న కూడా ‘బాహుబలి 2’ తరహాలో ఎక్కువ రోజులు హోల్డ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు.
నెక్స్ట్ టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు వరుసగా ఈ మూడేళ్ళలో రాబోతున్నాయి. టాలీవుడ్ నుంచి ‘స్పిరిట్’, ‘కల్కి 2898ఏడీ’, రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలు ఉన్నాయి. అలాగే హిందీ నుంచి ‘రామాయణం’, ‘యానిమల్ పార్క్’ లాంటివి నెక్స్ట్ 2000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ ముందుకి రాబోతున్నాయి.
ఈ సినిమాలన్నింటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే సత్తా ఉంది. అలాగే అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తోనే తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ మూవీపైన మేకర్స్ పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలను అయితే అందుకున్నారు. ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాలలో పుష్ప 2 కూడా టాప్ లిస్ట్ లో చేరింది.