పుష్ప 2 - బుక్ మై షో బ్లాస్ట్ అయ్యిందిగా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

Update: 2024-12-24 05:20 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఎవ్వరు అందుకోలేని హైట్స్ ని పుష్ప 2తో అల్లు అర్జున్ అందుకుంటున్నాడు. ఈ సినిమాకి నార్త్ లో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికి ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు అక్కడ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఖాతాలో వరుసగా రికార్డులు వచ్చి పడుతున్నాయి.

ఇప్పటికే వరల్డ్ వైడ్ గా థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ మూవీగా ఈ చిత్రం గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హిందీలో కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ స్థానాన్ని ఈ చిత్రం కైవసం చేసుకుంది. ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్న రికార్డ్ ని ఈ చిత్రం బ్రేక్ చేసింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్స్ ని ఈ చిత్రం కొల్లగొట్టడం విశేషం.

2024లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ గా ఈ మూవీ నిలిచింది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ ఖాతాలో మరో రికార్డ్ కూడా చేరింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఏకంగా 18 మిలియన్ టికెట్లని బుక్ మై షో ద్వారా ఈ సినిమా కోసం బుక్ చేసుకున్నారని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే ఈ సినిమా 1700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అదే జరిగితే ‘బాహుబలి 2’ కలెక్షన్స్ కి ఇంకా 120 కోట్ల దూరంలోనే ఉందని అర్ధమవుతోంది. ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ రికార్డ్ ని ఈ చిత్రం బ్రేక్ చేస్తే తరువాత దంగల్ ని కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని తరువాత జపాన్, చైనా భాషలలో కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇండియన్ సినిమాలని అక్కడి ఆడియన్స్ ఆదరిస్తున్నారు.

జపాన్, చైనా ప్రేక్షకులని ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తే ఓవరాల్ గా 2000 కోట్ల మార్క్ ని దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లోనే సరికొత్త శకానికి ‘పుష్ప 2’ చిత్రం నాంది పలికిందని ఈ కలెక్షన్స్ ద్వారా అర్ధమవుతోంది. మరి ఈ మూవీ జోరు ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News