పుష్ప 2 బాక్సాఫీస్.. 44 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.

Update: 2025-01-18 16:10 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ సుకుమార్ సృష్టించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు సాలీడ్ రెస్పాన్స్ లభించింది.

సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ రావడం, ప్రేక్షకులకు ఆశించిన కంటెంట్ అందించడంతో సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు మంచి బూస్ట్‌ లభించింది. పుష్ప 2 కథ, అల్లు అర్జున్ నటన, సంగీతం, సుకుమార్ టేకింగ్ అన్నీ కలిసివచ్చి సినిమా అద్భుతమైన విజయాన్ని అందించాయి. మొదటి వారం నుంచే సినిమా వసూళ్ల దిశలో కొత్త రికార్డులు సృష్టించటమే కాకుండా, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో షేర్ వసూలు చేయడం విశేషం.

7 వారంలో కూడా సినిమా ఇంకా కలెక్షన్లతో హడావుడి చేస్తూనే ఉంది. రీసెంట్ గా మరో 20 నిమిషాల నిడివిని జత చేశారు. దానికి తోడు టిక్కెట్ రేట్లు కూడా తగ్గాయి. ఇక ప్రతి రోజు సినిమా మినిమమ్ కలెక్షన్లు అందుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో ఈ చిత్రం 226 కోట్లు షేర్‌ను సాధించింది, ఇది బాక్సాఫీస్ వద్ద చిత్ర విజయానికి ప్రధాన ప్రమాణంగా నిలిచింది.

కర్ణాటకలో 53.32 కోట్లు, తమిళనాడులో 34.82 కోట్లు, కేరళలో 7.60 కోట్లు వసూలు చేయడం విశేషం. హిందీ మార్కెట్‌లో సినిమా అద్భుతమైన 386.25 కోట్ల షేర్‌ను రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో కూడా 127.16 కోట్ల షేర్‌ను సాధించింది. ఈ 44 రోజుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 835.15 కోట్ల షేర్ వసూళ్లు చేసి, 1,752.50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లతో సినిమా పాన్ ఇండియా మార్కెట్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

ప్రాంతాల వారీగా వరల్డ్ వైడ్ వసూళ్లు:

ఏపీ/తెలంగాణ: ₹226.00 కోట్లు (₹344.40 కోట్లు గ్రాస్)

కర్ణాటక: ₹53.32 కోట్లు

తమిళనాడు: ₹34.82 కోట్లు

కేరళ: ₹7.60 కోట్లు

హిందీ + ROI: ₹386.25 కోట్లు

ఓవర్సీస్: ₹127.16 కోట్లు

మొత్తం WW: ₹835.15 కోట్లు (₹1,752.50 కోట్లు గ్రాస్)

సినిమా మొత్తం బిజినెస్ 617 కోట్లుగా ఉండగా, బ్రేక్ ఈవెన్ 620 కోట్లు. బ్రేక్ ఈవెన్ చేరుకుని, ఇప్పుడు సినిమా 215.15 కోట్ల లాభాలను అందుకుంది. ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Tags:    

Similar News