సందీప్ కోసం చరణ్-బన్నీ మధ్య పోటీ!
`అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్`, `యానిమల్` లాంటి సంచలనాల తర్వాత యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కోసం స్టార్ హీరోలే క్యూ కట్టిన సంగతి తెలిసిందే.
`అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్`, `యానిమల్` లాంటి సంచలనాల తర్వాత యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కోసం స్టార్ హీరోలే క్యూ కట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అన్ని పరిశ్రమలు కూడా సందీప్ ట్యాలెంట్ కి సలాం కొట్టాయి. సందీప్ తో సినిమా చేయాలని స్టార్ హీరోలంతా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే అతడి లైనప్ కూడా రివీల్ చేసాడు. ప్రభాస్ తో `స్పిరిట్ తర్వాత రణబీర్ కపూర్ తో `యానిమల్ పార్క్` పట్టాలెక్కుతుంది.
ఈ రెండు సినిమాల తర్వాత అతడు ఎవరితో సినిమా చేస్తాడు? అన్నది ఇప్పట్లో తేలే అంశం కాదు. కానీ టాలీవుడ్ లో సందీప్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య పోటీ మొదలైందనే వార్త ఒకటి తెరపైకి వస్తోంది. ఇరువురు సందీప్ తో టచ్లో ఉన్నారుట. లైనప్ లో ఉన్న చిత్రాల అనంతరం తదుపరి సినిమా నాతోనే చేయాలని చరణ్ అంటున్నాడుట. అటు బన్నీ కూడా ఏం తగ్గలేదుట. తన స్నేహితుడు ప్రభాస్ తర్వాత అతడి స్నేహితుడైనా బన్నీతోనే చేయాలని పట్టుబడుతున్నాడుట.
ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియదు గానీ ఇరువురు మాత్రం వెనక్కి తగ్గే సన్నివేశం ఎక్కడా కనిపిం చడం లేదని సన్నిహితుల నుంచి వినిపిస్తోన్న మాట. ఓసారి ఆ హీరోల లైనప్ చూస్తే? ఎవరికి పాజిబిలిటీ ఉంద న్నది అంచనా వేయోచ్చు. ప్రస్తుతం బన్నీ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా మొదలవ్వాల్సి ఉంది. అది సమ్మర్ లో పట్టాలెక్కుతుంది. ఇది పాన్ ఇండియా చిత్రం. ఆ తర్వాత బన్నీ ఇంకే డైరెక్టర్ కి కమిట్ అవ్వలేదు.
అటు రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే 17వ చిత్రాన్ని సుకుమార్ తో మొదలు పెడతాడు. ఈ రెండు రిలీజ్ అయ్యేలోపు సందీప్ తన రెండు చిత్రాల రిలీజ్ చేసుకుని రెడీగా ఉండాలి. ఈ కేస్ లో సందీప్ కావాలి అని చరణ్ గట్టిగా అనుకుంటే సందీప్ చిత్రాలకంటే? ముందుగా తన చిత్రాలను పూర్తి చేసుకురి రెడీగా ఉండాలి. ఎందుకంటే సందీప్ హీరో కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదిప్పుడు.
అతడి కోసమే హీరో వెయిట్ చేయాలి. ఇక బన్నీ కోణంలో చూస్తే? బన్నీకే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ చేతిలో త్రివిక్రమ్ సినిమా ఒక్కటే ఉంది. ఈ సినిమా ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత సందీప్ కోసం ఏడాది పాటైనా ఎదురు చూసే సమయం బన్నీకి ఉంటుంది.