పారితోషికంలో ఐకాన్ స్టార్ రేంజ్?
పారితోషికంలో ఇప్పుడు బన్ని అందరి కంటే టాప్ లో ఉన్నాడనే గుసగుస ఫిలింనగర్ వర్గాల్లో వేడెక్కిస్తోంది. బన్ని పుష్ప 2 కోసం ఏకంగా 300 కోట్లు అందుకుంటున్నాడని
ప్రభాస్ పారితోషికం రేంజ్ 100 కోట్లు ప్లస్ లాభాల్లో వాటాలు అందుకుంటున్నాడంటూ ప్రచారం ఉంది. దళపతి విజయ్ ఒక్కో సినిమాకి ఏకంగా 200 కోట్లు డిమాండ్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 150 కోట్ల వరకూ పారితోషికం వసూలు చేస్తున్నారన్న చర్చ సాగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు కూడా ఇటీవలి పాన్ ఇండియా విజయాల నేపథ్యంలో 100 కోట్లకు దగ్గరగా పారితోషికాల్ని పెంచేశారని గుసగుస వినిపించింది.
అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పైన పేర్కొన్న స్టార్లందరి రికార్డుల్ని బ్రేక్ చేశాడని గుసగుస వినిపిస్తోంది. పారితోషికంలో ఇప్పుడు బన్ని అందరి కంటే టాప్ లో ఉన్నాడనే గుసగుస ఫిలింనగర్ వర్గాల్లో వేడెక్కిస్తోంది. బన్ని పుష్ప 2 కోసం ఏకంగా 300 కోట్లు అందుకుంటున్నాడని.. ఈ సినిమా రిలీజ్ ముందే 1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేయడంతో ఇదంతా స్టార్ పవర్ వల్లనే సాధ్యమైందని భావించిన నిర్మాతలు అంత పెద్ద మొత్తాన్ని కట్టబెడుతున్నారని బలమైన టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో అల్లు అర్జున్ పేరు అగ్ర తాంబూలం అందుకున్నట్టే. మరోవైపు రష్మిక పారితోషికం రేంజ్ 10 కోట్లకు చేరుకోగా, ఫహద్ ఫాజిల్ కు 8కోట్ల వరకూ పుష్ప నిర్మాతలు చెల్లించారని ప్రచారం ఉంది. పారితోషికాలు నిజంగానే కళ్లు భైర్లు కమ్మేలా ఉన్నాయి. పుష్ప 2 చిత్రంతో పంపిణీ వర్గాలకు నష్టం లేకుండా ఉండాలంటే ఎంత వసూలు చేయాలి? అంటే.. కేవలం థియేట్రికల్ గా 600 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య వసూలు చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ 450 కోట్ల వరకూ జరిగిందని కూడా చెబుతున్నారు.