బన్నీ స్నేహ.. సో క్యూట్

అయితే వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో తొలుత విషెస్ చెప్పిన బన్నీ.. ఆ తర్వాత తన తల్లితో కూతురు అర్హ పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత స్నేహ.. క్రేజీ పిక్చర్స్ ను పోస్ట్ చేశారు.

Update: 2024-09-08 07:22 GMT

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెయిర్ ఒకటన్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ, స్నేహ.. ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తుంటారు బన్నీ. రీసెంట్ గా ఫారిన్ ట్రిప్ కు కూడా వెళ్లారు. ఆ సమయంలో వారు దిగిన పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రెక్కింగ్ పిక్స్ అయితే బాగా ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్ కు సంబంధించిన పిక్స్.. తెగ చక్కర్లు కొడుతున్నాయి. కుటుంబమంతా ఎంతో సంతోషంగా పండుగ జరుపుకున్నట్లు కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ వైట్ కుర్తాలో ట్రెడిషనల్ గా కనిపిస్తుండగా.. స్నేహ బ్లాక్ శారీలో ఎంతో అందంగా ఉంది. వారి పిల్లలు అయాన్, అర్హ ఎప్పటి లాగే క్యూట్ గా ఆకట్టుకున్నారు. బన్నీ ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్, నిర్మల కూడా పిక్స్ లో ఉన్నారు.

అయితే వినాయక చవితి సందర్భంగా సోషల్ మీడియాలో తొలుత విషెస్ చెప్పిన బన్నీ.. ఆ తర్వాత తన తల్లితో కూతురు అర్హ పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆ తర్వాత స్నేహ.. క్రేజీ పిక్చర్స్ ను పోస్ట్ చేశారు. అర్హతో బన్నీ కూడా దేవుడిని పూజిస్తున్న పిక్ ను పంచుకున్నారు. అయాన్, అర్హ కొబ్బరికాయలు కొడుతున్న క్యూట్ ఫోటోస్ ను పోస్ట్ చేశారు. తీర్థం తీసుకుంటున్న ఓ పిక్ లో గ్లోరియస్ గా కనిపిస్తూ ఆమె కూడా ఆకట్టుకుంటున్నారు.

ఇక.. రీసెంట్ గా మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న అల్లు అర్జున్, స్నేహ.. 2011 మార్చి 6వ తేదీన వివాహం బంధంలోకి అడుగుపెట్టారు. ఓ ప్రైవేట్ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. ప్రేమలో కూడా పడ్డారు. ఇదే విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పారు. అయితే బన్నీది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాగా.. స్నేహాది పూర్తిగా సినిమాలతో ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీ.

దీంతో వారి పెళ్లికి మొదట్లో కాస్త ఇబ్బందులు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పెద్దలు అంగీకరించడంతో అందరి సమక్షంలో హైదరాబాద్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. బన్నీ, స్నేహ ప్రేమ కమ్ పెళ్లి బంధానికి గుర్తుగా 2014లో అయాన్ జన్మించాడు. 2016లో అర్హ పుట్టింది. అలా ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకుని ఫుల్ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు అల్లు అర్జున్, స్నేహ.

Tags:    

Similar News