'సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్' ఎవరంటే?
ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా వీరిలో 'సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ లో ప్రస్తుతం ఆరేడుగురు స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నలుగురు అగ్ర హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు కారం, కల్కి 2898 ఏడీ, దేవర-1, పుష్ప-2 వంటి సినిమాలతో థియేటర్లలో సందడి చేశారు. ఈ చిత్రాలకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారంగా వీరిలో 'సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.
మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''గుంటూరు కారం''. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా, మహేశ్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేశారు. 10 రోజుల్లోనే 230 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు కానీ, ఒరిజినల్ గా ఫైనల్ రన్ లో 172 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించినట్లు టాక్ ఉంది. కాకపోతే ఈ సినిమాకి ఓటీటీలో అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో కొన్ని వారాల పాటు గ్లోబల్ ట్రెండింగ్ లిస్టులో ఉంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ''కల్కి 2898 AD''. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే కీలక పాత్రల్లో నటించారు. జూన్ నెలాఖరున వచ్చిన ఈ చిత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర 1' సినిమా సెప్టెంబర్ చివర్లో వచ్చింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా సరే తారక్ స్టార్ డమ్ తో రూ.500 కోట్ల క్లబ్ లో చేరగలిగింది.
ఇప్పుడు లేటెస్టుగా అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2: ది రూల్" సినిమా థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించినట్లుగానే బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది. మూడు రోజులు తిరక్కుండానే 500 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. 1000 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
ఇలా 2024లో నలుగురు పెద్ద హీరోలు బాక్సాఫీస్ బరిలో దిగారు. వారిలో ప్రభాస్, అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు. కాకపోతే 'కల్కి 2898 AD' విజయంలో డార్లింగ్ తో పాటుగా అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ కు కూడా భాగం ఉంది. ఇక్కడ 'పుష్ప 2' సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సోలోగా బన్నీకి దక్కుతుంది. వరల్డ్ వైడ్ గా రోజువారీ వసూళ్లు చూస్తుంటే, RRR & కల్కి రికార్డులు కూడా బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక నార్త్ లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మూడు రోజుల్లోనే 205 కోట్లు సాధించి బాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 'పుష్ప 2' కేవలం హిందీలో 1000 కోట్లు రాబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ఇండియన్ సినిమాలోనే 'సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్' అల్లు అర్జున్ అని చెప్పాలి.