మొండిగా..మూర్ఖంగా బన్నీ..అందుకే ఆ స్థానం!
'ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే అది ఇప్పుడు ఒక ఓ ఇత్తనం. అది పదేళ్ల తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. ఆ డౌట్ వచ్చిన రోజు ఆగిపోతాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఓ మాట అన్నారు. ఏ విషయంపైనైనా నిర్ణయం తీసుకునే ముందు బన్నీ ఎంతో లోతుగా ఆలోచిస్తాడని...అన్ని విషయాలు కూలం కుశంగా ఆలోచించుకున్న తర్వాత...దానిమీద సమగ్ర విశ్లేషణ జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాడన్నారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోడని బన్నీలో ఆ గొప్ప లక్షణం తనకు ఎంతో ఇష్టమన్నారు.
ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఎంతో ఆలోచిస్తాడని... ఎంతో డౌన్ టూ ఎర్త్ తోనూ ఆ నిర్ణయాలు కూడా ఉంటా యన్నారు. ఇటీవల అన్ స్టాపబుల్ షోకి హాజరైన బన్నీ ఇలా మాట్లాడే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హృదయానికి కూడా ఎంతో దగ్గరయ్యారు. బన్నీ ప్లానింగ్...విధానిని పెద్ద ప్యాన్ ని అంటూ నటసింహమే దిగొచ్చి అన్నది అంటే? బన్నీ ఎంతటి వారు అన్నది చెప్పొచ్చు. అదేంటో బన్నీ మాటల్లోనే...
'ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే అది ఇప్పుడు ఒక ఓ ఇత్తనం. అది పదేళ్ల తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. ఆ డౌట్ వచ్చిన రోజు ఆగిపోతాం. నా జర్నీలో ఇలాంటి వాళ్లను చాలా మందిని చూసాను. ఈ విషయంలో ఎవడు మూర్కంగా ఉంటాడో వాడే నిలబడతాడు' అని అన్నాడు బన్నీ. బహుశా జీవితంలో ఎదిగే విషయంలో బన్నీ ఇంత మొండిగా ఉన్నాడు కాబట్టే అంత సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.
ఇప్పటివరకూ అతడు సాధించిన విజయాలు..అవార్డులు బన్నీని ఆ స్థానంలో కూర్చోబెట్టాయి. 'పుష్ప' సినిమాతో అతడిలో నిజమైన నటుడు బయటకు వచ్చాడు? అన్నది నిజం. అతడి రియలిస్టిక్ పెర్పార్మెన్స్ కి దేశమే ఫిదా అయింది. అందుకే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సొంతం చేసుకున్నారు. ఇంత వరకూ తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు లేడు. ఆ వెలితిని బన్నీ తీర్చాడు. వృత్తి..వ్యక్తిగత జీవితంలో ఎంతో క్లారిటీ తో ఉన్నాడన్నది బన్నీ మాటల్ని బట్టి అర్దమవుతుంది.