అల్లు అర్జున్ - త్రివిక్రమ్.. ఈ ఆలస్యం అమృతమే..
అట్లీ త్రివిక్రమ్ లైన్ లో ఉన్నా కూడా ముందుగా ఎవరి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.;
స్టార్ హీరోల ప్లానింగ్ లో ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కోలా ఉంటుంది. వరుసగా సినిమాలు చేసే వారు కొందరైతే.. ఒకేసారి రెండు సినిమాలను బ్యాలెన్స్ చేసేవారు ఇంకొందరు. అల్లు అర్జున్ మాత్రం తన ప్రతి సినిమా విషయంలో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతాడు. ఇటీవల పుష్ప 2తో నేషనల్ వైడ్ హిట్ కొట్టిన బన్నీ ఆ తరువాత ప్రాజెక్టు అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ త్రివిక్రమ్ లైన్ లో ఉన్నా కూడా ముందుగా ఎవరి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల విదేశీ ట్రిప్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చిన అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ను ప్రత్యేకంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో త్రివిక్రమ్ తన మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఫైనల్ నేరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బన్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్‌లోకి వెళ్లే ముందు మరో సినిమాను కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే త్రివిక్రమ్‌కు ప్రత్యేకంగా ఆరు నెలల టైమ్ అడిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ మాత్రం తన సినిమాను ఆలస్యం చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదని సమాచారం. ఎందుకంటే మేకింగ్ విషయంలో పక్కా ప్లాన్ సెట్ చేసుకోవడానికి ఇంకాస్త సమయం దొరికితే మంచిదే అన్నట్లు ఇద్దరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అసలే హిట్టు కాంబినేషన్, పైగా త్రివిక్రమ్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా. బడ్జెట్ కూడా 300 కోట్లకు పైనే ఉంటుంది.
కాబట్టి ప్లానింగ్ లో ఎక్కడ తేడా రాకుండా సరైన అవుట్ పుట్ తో రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆలస్యం కూడా అమృతం లాంటి టైమ్ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగించుకుంటూ, స్క్రిప్ట్ ఫైనల్ టచ్ అందజేస్తున్నట్లు సమాచారం. మైథలాజికల్ టచ్ ఉన్న కథ కావడంతో, ఎప్పటికీ అప్రోచ్ మారకుండా ప్లాన్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అదే సమయంలో, బన్నీ తన ముందుగా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌ను కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నాడు.
అల్లు అర్జున్ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ, ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయమే. పాన్ ఇండియా క్రేజ్ వచ్చిన అనంతరం స్టార్ హీరోలు చాలా అరుదుగా ఒకేసారి రెండు సినిమాలను సమాంతరంగా ప్లాన్ చేస్తారు. త్రివిక్రమ్‌తో తన నాలుగో సినిమా చేయడానికి ముందుగా మరో ప్రాజెక్ట్ పూర్తిచేయాలనే నిర్ణయం తీసుకోవడం కూడా చాలా వ్యూహాత్మకంగా మారింది. ఈ విధంగా రెండు సినిమాలను బ్యాలెన్స్ చేయడం బన్నీకి ప్రత్యేకతను చూపిస్తుంది.
అయితే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కచ్చితంగా 2026లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో బన్నీ ముందుకెళ్లనున్నాడట. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందబోయే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. అయితే మాస్, కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన బన్నీ, త్రివిక్రమ్ చెప్పిన కొత్త కథతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.