మామ పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.;

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అక్కడ ఆస్పత్రిలో చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. హుటాహుటీన పవన్ కల్యాణ్ సహా చిరంజీవి- సురేఖ దంపతులు సింగపూర్ చేరుకుని మార్క్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. అతడి దగ్గర ఉండి సపర్యలు చేసారు. అటుపై మార్క్ శంకర్- అన్నా లెజినోవా సహా పవన్ కల్యాణ్, చిరు కుటుంబం కూడా తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ .. తన మామ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయనను ఇంటికి వెళ్లి కలిశారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో కుటుంబ సభ్యులను అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి దంపతులు కలిసారు. వారి కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారు. గంట పైగానే అక్కడ గడిపారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ - అల్లు అర్జున్ మధ్య గ్యాప్ పెరిగిందనే వార్తల నడుమ ఇది ప్రత్యేక వార్త. గతంలో సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు అయినప్పుడు మేనమామ పవన్ కళ్యాణ్ వెంటనే ఫోన్ లో అల్లూని పరామర్శించారని కథనాలొచ్చాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నేరుగా మావయ్య పవన్ కల్యాణ్ ని కలిసి కుమారుడు ఆరోగ్యం గురించి పరామర్శించారు. అయితే వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇంతవరకూ బయటకు రాలేదు.