బాలయ్యకు అర్జున్ బ్రో విషెస్..
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పద్మభూషణ్ అవార్డుకు సెలెక్ట్ అయిన సందర్భంగా బాలయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన బన్నీ, తెలుగు సినీ పరిశ్రమకు బాలయ్య చేసిన సేవకు ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అన్ని విధాలా అర్హులని రాసుకొచ్చారు.
బాలయ్యతో పాటూ తమిళ నటుడు అజిత్ కుమార్ కు కూడా ఐకాన్ స్టార్ శుభాకాంక్షలు తెలిపాడు. మీ విజయం ఎందరికో స్పూర్తిదాయకమని, ప్రశంసనీయమని బన్నీ తెలిపాడు. శోభన, శేఖర్ కపూర్, అనంత్ నాగ్‌కు శుభాకాంక్షలు చెప్పాడు బన్నీ. కళల విభాగంలో వీరందరికీ అవార్డు రావడంతో తన గుండె సంతోషంతో నిండిపోయిందని చెప్పిన బన్నీ పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ హృదయపూర్తవక శుభాకాంక్షలు తెలియచేశాడు.
బన్నీ- బాలయ్య మధ్య మంచి అనుబంధమున్న విషయం తెలిసిందే. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ రెండు సార్లు గెస్టుగా వచ్చాడు. వారిద్దరూ ఒకరినొకరు బ్రో, బ్రో అని సరదాగా పిలుచుకుంటూ బాలయ్య అడిగిన అన్ని సరదా ప్రశ్నలకు బన్నీ తనదైన శైలిలో సమాధానాలిచ్చి అలరించాడు.
సినిమాల విషయానికొస్తే బాలయ్య రీసెంట్ గా సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా ప్రస్తుతం బాలయ్య బోయపాటితో అఖండ2 చేస్తున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప2తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో చేయబోయే తన తర్వాతి సినిమా కోసం తనని తాను రెడీ చేసుకుంటూ పుష్ప2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.