బన్నీ - అట్లీ.. అంత పెద్ద VFX సంస్థను కలిశారంటే..

ఈ కాంబినేషన్ ఒక్కటే కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా హైలెట్ అయిన మరో అప్డేట్ మరింత ఆసక్తిని రేపుతోంది.;

Update: 2025-04-08 11:33 GMT
బన్నీ - అట్లీ.. అంత పెద్ద VFX సంస్థను కలిశారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌పై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా చూస్తోంది. ఈ కాంబినేషన్ ఒక్కటే కాదు, ఇప్పుడు లేటెస్ట్ గా హైలెట్ అయిన మరో అప్డేట్ మరింత ఆసక్తిని రేపుతోంది. USలోని ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ లొలా VFX (Lola VFX) ను బన్నీ-అట్లీ జట్టు సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది మాములు విషయం కాదు. ఎందుకంటే, ఈ సంస్థ హాలీవుడ్ స్థాయి చిత్రాలకు పనిచేసింది.

లొలా వీఎఫ్‌ఎక్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలలో ఒకటి. ఈ కంపెనీ అవెంజర్స్: ఎండ్ గేమ్, హ్యారీ పోటర్, కెప్టెన్ అమెరికా, గార్డియన్స్ ఆఫ్ గెలక్సీ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్ సేవలు అందించింది. అంతే కాకుండా, భారతీయ ప్రాజెక్టులుగా కల్కి 2898 AD, GOAT, ఇండియన్ 3 వంటి అగ్రశ్రేణి సినిమాలకు కూడా ఈ సంస్థ వీఎఫ్‌ఎక్స్ సహకారం అందించింది. అలాంటి స్థాయిలో ఉన్న సంస్థను ఓ తెలుగు సినిమా కోసం సందర్శించడం గొప్ప విషయం.

ఈ సినిమా ఇప్పుడు ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్ తో సిద్ధమవుతోంది. ఇందులో బన్నీ కొత్త షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేసే సినిమా కాబట్టి, దీనిపై అంచనాలు స్వభావికంగానే ఎక్కువగా ఉన్నాయి. కానీ అట్లీ బన్నీ టీమ్ లొలా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌షాప్‌కి వెళ్లడాన్ని చూస్తే, ఇది కేవలం కమర్షియల్ ఫార్ములా సినిమా కాదు. వేరే స్థాయిలో ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కోసం, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచే అత్యంత నిష్టతో ప్లానింగ్ జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతానికి వెళ్లి బన్నీ, అట్లీ వ్యక్తిగతంగా స్టూడియోలలో టీమ్‌ను కలవడం, పనితీరును గమనించడం లాంటివి ఇండియన్ సినిమాల్లో అరుదుగా కనిపించే దృశ్యాలు. ఇవన్నీ చూస్తే బన్నీ ఎంత శ్రద్ధతో ఈ ప్రాజెక్ట్‌ను చూస్తున్నాడో అర్థమవుతుంది.

లొలా వీఎఫ్‌ఎక్స్ సూపర్ స్పెషలిస్టులు కాగా, వయసు తగ్గించే డిజిటల్ డీ-ఏజింగ్, హైడెఫినిషన్ ఫేస్ రీప్లేస్‌మెంట్ వంటి టెక్నిక్స్‌లో నిపుణులు. బహుశా ఈ సినిమాలో అలాంటి టెక్నాలజీ ఉండే అవకాశముంది. ఇదివరకే బన్నీ రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్ వచ్చింది. ఒక హీరో విభిన్న వయసుల పాత్రలు పోషించే సబ్జెక్ట్ అయితే, దీనికి లొలా వీఎఫ్‌ఎక్స్ బాగా సరిపోతుంది. ఇది చూసి బన్నీ ఫ్యాన్స్ “పుష్ప లెవెల్ కాదు, ఇది హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్” అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇక సినిమా టైటిల్‌, మ్యూజిక్ డైరెక్టర్‌, హీరోయిన్ వంటి వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకి రానున్నాయి. కానీ ఇప్పటి వరకు లొలా వీఎఫ్‌ఎక్స్‌కి వెళ్లడం, అమెరికన్ టెక్నీషియన్లతో భేటీ కావడం వంటి దశలు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ తెలుగు సినీ పరిశ్రమకు ఒక గర్వకారణంగా నిలవబోతుందనే నమ్మకం పెరిగిపోతోంది. బన్నీ, అట్లీ కాంబినేషన్‌తో, లొలా టచ్‌తో, ఒక కొత్త ప్రపంచం రాబోతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News