ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనో విజయవంతమైన నటుడు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియాలోనూ గుర్తింపు దక్కించుకున్నారు. 'పుష్ప-2' తో ఆయస్థాయి ఇండియా వైడ్ రెట్టింపు అవుతుంది అన్న కాన్నిడెన్స్ యూనిట్ లో కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ 'పుష్ప-2' ప్లాన్ చేస్తున్నారని ప్రచారం సాగుతుంది. కానీ అది ఎంత వరకూ వాస్తవం అన్నది క్లారిటీ రావాలి.
ఆ రేంజ్ లో రిలీజ్ చేసి సక్సెస్ అందుకుంటే? గనుక బన్నీ నటుడిగా మరో స్థాయికి చేరుకుంటారు? అన్నది వాస్తవం. అయితే ఇటీవలే ఓ యువ నిర్మాత బన్నీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బన్నీ విజన్ వేరు అని..ఆయన ఆలోచన వేరు అని...భవిష్యత్ లో ఆయన రేంజ్ మారబోతుందని...దేశాలు ఖండాలు దాటిన తెలుగు సినిమా నేపథ్యంలో బన్నీ ఇంకేదో కొత్తగా చేయబోతున్నట్లు ఆయన మాటల ద్వారా బయట పడింది.
ఆ సమయంలో స్టేజ్ వద్దనే ఎదురుగా ఉన్న బన్నీ కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. దీంతో ఆ యువ నిర్మాత మాటలకి..బన్నీ కన్నీళ్లకి ఏదో బలమైన సంబంధం ఉన్నట్లు అభిమానులకు అనిపిస్తుంది. బన్నీ ఇంకేదో నిజంగానే చేస్తున్నారా? అన్న సందేహం ఒక్కసారిగా మొదిలింది. మరి బన్నీ ప్రపంచ దేశాల్ని షేక్ చేసాలా? అంత పెద్ద ప్లానింగ్ ఏం చేస్తున్నారు? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇది నిజమైతే బన్నీలో ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది? అన్నది ఆసక్తికరమే.
'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో రామ్ చరణ్..ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయ్యారు. వాళ్లకి హాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. వాటిని రిజెక్ట్ చేసే స్థాయిలోనే ఆ ఇద్దరు ఉన్నట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది. నాటు నాటు పాటకి ఆస్కార్ రావడంతో మరింత ఫేమస్ అయ్యారు. ఇక ప్రభాస్ కూడా వరల్డ్ వైడ్ అంతే ఫేమస్. చైనా..జపాన్ లోసైతం అభిమానులు ఏర్పడ్డారు.
పుట్టిన రోజు వస్తే ప్రత్యేకంగా ఆయా దేశాల్లో సెలబ్రేషన్లు సైతం నిర్వహిస్తున్నారు. అయితే బన్నీ ఇంకా ఆ స్థాయిని చేరుకోలేదు. విదేశాల్లో ఆయనకంత ఫాలోయింగ్ లేదు. ఈ నేపథ్యంలో బన్నీ తదుపరి జర్నీని ఖండాలు..దేశాలు దాటేలా ప్లాన్ చేస్తున్నారా? అన్నది చూడాలి.