పుష్ప లాంటి హిట్ ఒక్కటైనా ఉందా?

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమాతో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు.

Update: 2024-08-29 07:09 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. నేషనల్ వైడ్ గా తన ఫ్యాన్ బేస్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఆ సినిమాతో జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. తెలుగు చిత్ర సీమ ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. నార్త్ టూ సౌత్.. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు.

ఇప్పుడు సీక్వెల్ తో ఫుల్ బిజీ గా ఉన్నారు అల్లు అర్జున్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా కోపరేట్ చేస్తున్నారు. మరో 99 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా పుష్ప -2 విడుదల కానుంది. అయితే కొద్ది రోజులుగా మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి బన్నీ వెళ్లడంతో అప్పటి నుంచి సాగుతూనే ఉంది.

రీసెంట్ గా మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో రెండు ఫ్యామిలీల అభిమానుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇటీవల జనసేన్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అస్సలు అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ లేరని అన్నారు. ఆయనకు ఎవరూ రమ్మని చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడితే మళ్లీ కౌంటర్ ఇస్తానని అన్నారు.

ఇప్పుడు.. మరో జనసేన నేత చలమలశెట్టి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తే ఊరుకోమని అన్నారు. పుష్ప 2ను తమ నియోజకవర్గంలో అడ్డుకుంటామని తెలిపారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో మరింతగా వార్ జరుగుతోంది. బన్నీ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. పుష్ప సినిమా అడ్డుకుంటే ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

అనవసరంగా జనసేన పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ మూవీ హిట్స్ తో మెగా ఫ్యామిలీకి సంబంధం లేదని, ఫెయిల్యూర్స్ తో కూడా సంబంధం లేదని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అలాంటప్పుడు మూవీని అడ్డుకుంటే ఎవరూ ఊరుకోరని అంటున్నారు. మూవీ హిట్ అయితే హిట్ చేస్తారు.. ఫ్లాప్ అయితే ఫ్లాప్ చేస్తారని చెబుతున్నారు. అసలు పుష్ప లాంటి భారీ హిట్.. మెగా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ లో ఎవరికైనా దక్కిందా అని అడుగుతున్నారు. ఏది ఏమైనా జనసేన నేతలు.. అల్లు అర్జున్ విషయంలో ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News