డాడీకి షాక్ ఇచ్చిన బన్నీ...ఇదేం ట్విస్ట్!
ఏ నటుడికైనా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? డబ్బు..పేరు..హోదా? అన్ని ఉన్నాయి. కానీ 'మా నాన్న నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ' బన్నీ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నేడు బన్నీ రేంజ్ ఏంటన్నది తెలిసిందే. పాన్ ఇండియా స్టార్. కోట్లలో పారితోషికం అందుకుంటున్నాడు. అంతకు మించి జాతీయ ఉత్తమ నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఏ నటుడికైనా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది? డబ్బు..పేరు..హోదా? అన్ని ఉన్నాయి. కానీ 'మా నాన్న నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ' బన్నీ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
అవును..అల్లు అర్జున్ కి వాళ్ల నాన్న అల్లు అరవింద్ తనతో ప్రీ సర్వీస్ చేయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. కనీసం రూపాయి కూడా ఇవ్వలేదుట. అంత పెద్ద స్టార్ కి పారితోషికం ఇవ్వకపోవడం ఏంటి? అనుకుంటు న్నారా? అయితే అసలు వివరాల్లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి హిట్ చిత్రాల్లో ఒకటైన 'విజేత'లో బన్నీ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని ఎంత మందికి తెలుసు. ఆ చిత్రంతోనే బన్నీ తొలిసారి మ్యాకప్ వేసుకున్నాడు.
అలా మ్యాకప్ వేసుకోవడం అన్నది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ 'మా నాన్న నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు' అని బన్నీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. దానికి స్మైలీ ఎమోజీ జోడించారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో.. 'విజేత' 100 రోజుల జ్ఞాపికతోపాటు అల్లు అరవింద్ నవ్వుతూ కనిపించారు.
ప్రస్తుతం బన్నీ పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. ఆసినిమాకి గాను బన్నీ కి వాళ్ల నాన్న పారితోషికం ఇవ్వలేదని సరదాగా పోస్ట్ చేసాడు. బన్నీ 'విజేత'తో పాటు అప్పట్లో 'స్వాతిముత్యం' చిత్రంలో కూడా కనిపించారు. అటుపై పెద్దాయ్యాక చిరంజీవి నటించిన 'డాడీ' సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు. ఆ తర్వాత 'గంగోత్రి' తో హీరోగా పరిచయమయ్యాడు. అటుపై బన్నీ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్ని దాటి పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు. ఇప్పుడా రేంజ్ పాన్ వరల్డ్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.