ఈ అవార్డుకు 'రుద్ర‌వీణ‌-ఘ‌రానామొగుడు' స్ఫూర్తి: బ‌న్ని

తాజాగా ప్ర‌ముఖ తెలుగు డైలీతో మాట్లాడుతూ ఇలాంటి పాత్ర‌కు జాతీయ అవార్డ్ వ‌స్తుందా? అనే సందేహం త‌న‌కు కూడా ఉంద‌ని అల్లు అర్జున్ అన‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

Update: 2023-08-27 11:12 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప -ది రైజ్' బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే గాక అల్లు అర్జున్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డును అందించింది. తొమ్మిది ద‌శాబ్ధాల తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఉత్త‌మ న‌టుడిగా ఇదే తొలి జాతీయ అవార్డ్. ఆర్య సుక్కూ పుష్ప‌ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ‌న్నీలో మెద‌డ్ ఆర్టిస్టును వంద‌శాతం బ‌య‌ట‌కు తెచ్చిన సుకుమార్ అద్భుతాలు చేయ‌గ‌లిగారు. అస‌లు ఒక ఉగ్ర‌వాది పాత్ర‌కు జాతీయ అవార్డ్ వ‌స్తుందా రాదా? అనే సందేహం హిందీ మీడియాకే కాదు.. బ‌న్నీకి కూడా క‌లిగింద‌ట‌. తాజాగా ప్ర‌ముఖ తెలుగు డైలీతో మాట్లాడుతూ ఇలాంటి పాత్ర‌కు జాతీయ అవార్డ్ వ‌స్తుందా? అనే సందేహం త‌న‌కు కూడా ఉంద‌ని అల్లు అర్జున్ అన‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

అయితే లాజిక్ లు వెత‌క్కుండా జూరీ న‌ట‌న‌కు ప‌ట్టంగ‌ట్టింద‌ని అన్నారు. నా జీవితంతో ఎలాంటి సారూప్య‌త లేని పాత్ర పుష్ప‌రాజ్. అస‌లు నేను పుష్ప సినిమా చేయటానికి నాకు ప్ర‌త్యేక‌ కారణం కూడా ఉంది. మన భారతీయ సినీ పరిశ్రమలో కమర్షియల్ సినిమాను వేరుగా.. పెర్ఫామెన్స్‌ ఉన్న సినిమాలను వేరుగా చూస్తారు.. తీస్తారు. పెర్‌ఫార్మెన్స్‌ ఉన్న సినిమాలు కమర్షియల్‌గా పనికిరావని కొందరు భావిస్తూ ఉంటారు.

ఉదాహరణకు చిరంజీవి గారి సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. న‌ట‌న భావోద్వేగాలు ఉన్న సినిమా రుద్ర‌వీణ‌. కమర్షియల్ సినిమా అన‌గానే 'ఘరానా మొగుడు' గుర్తుకొస్తుంది. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాడిగా ఆ రెండు సినిమాల‌ను మైండ్ లో పెట్టుకుని 'పుష్ప' కోసం హార్డ్ వర్క్ చేసాను. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో పెర్ఫామెన్స్ ఎందుకు ఉండ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల‌తో పుష్ప‌రాజ్ పాత్ర‌ను చేసాను.. అని తెలిపారు.

మెగాస్టార్ న‌టించిన ఆ రెండు సినిమాలే ఈ ఆలోచ‌న రావ‌డానికి కార‌ణ‌మ‌ని అల్లు అర్జున్ అన్నారు. మొత్తానికి పుష్ప చిత్రంలో పాత్ర‌ను చేయ‌డానికి రుద్ర‌వీణ‌- ఘ‌రానామొగుడు రెండు విభిన్న‌ జానర్ల‌ను బ్లెండ్ చేయాల‌నే ఆలోచ‌నే కార‌ణ‌మ‌ని ఇప్పుడు అంద‌రికీ స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. సినీప‌రిశ్ర‌మ మ‌న‌కు బ‌లం అయిందా .. ప‌రిశ్ర‌మ‌కు మ‌న‌మే బ‌లం అయ్యామా? అన్న‌ది కూడా చాలా ముఖ్యం. ఇప్ప‌టికి నేను ప‌రిశ్ర‌మ‌కు బ‌లం అయ్యాన‌న్న ఆనందం నాలో ఉంద‌ని కూడా బ‌న్ని అన్నారు.

Tags:    

Similar News