వైసీపీ లీడర్ కోసం అల్లు అర్జున్.. ఇది అసలు మ్యాటర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-05-11 10:15 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓవైపు చిత్రీకరణ.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ అనేక సార్లు అనౌన్స్ చేసిన ఆగస్టు 15వ తేదీన పుష్ప-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస అప్డేట్స్ తో సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక మోస్ట్ అవైటెడ్ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ నేడు నంద్యాలలో మెరిశారు. తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి అక్కడికి వెళ్లారు. నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా బరిలో దిగిన తన బెస్ట్ ఫ్రెండ్ రవిచంద్ర కిషోర్ రెడ్డికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఆ తర్వాత తనను చూడడానికి వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ కు రవిచంద్ర ఇంటి బాల్కనీ నుంచి అభివాదం చేశారు.

పుష్ప.. పుష్ప అంటూ ఓ రేంజ్ లో సందడి చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ నంద్యాల వెళ్తారని వార్తలు వచ్చినప్పటి నుంచి నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఇది నెగిటివ్ గా వెళ్లొచ్చు అని కూడా ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీ- బీజేపీ- జనసేన కూటమి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు మద్దతు తెలిపారు.

అల్లు అర్జున్ కూడా రీసెంట్ గా పవన్ ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యుడిగా పవన్ కు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని తెలిపారు. గత ఎన్నికల్లో కూడా బన్నీ పవన్ ప్రచారంలో ఉండగా సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇక బాల్య స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అల్లు స్నేహ అలాగే రవిచంద్ర భార్యా కూడా మంచి స్నేహితులు.

ఎప్పటి నించో వీరి మధ్య మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక ఓ వైపు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తూ.. మరోవైపు వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చెయ్యడం మెగా ఫాన్స్ మధ్య లో సోషల్ మీడియా లో చీలికలు వచ్చాయి . కానీ మెగా ఫాన్స్ మధ్య దీని కోసం అంత చర్చ అవసరం లేదు. కేవలం తనకు బెస్ట్ ఫ్రెండ్ కనుక బన్నీ.. నంద్యాల వెళ్లి మరీ రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అతన్ని గెలిపించాలని కోరారు.

బన్నీ ఏం మాట్లాడాడు అంటే.. 'రవి పాలిటిక్స్ లోకి రాకముందు నుంచే వారానికి ఒకసారి కలుసుకునే వాళ్ళం.. ఇక ఈ ఐదేళ్లుగా ఆరు నెలలకు ఒకసారి కలుసుకుంటున్నాం.. ప్రజల కోసం కష్టపడుతున్న మనిషికి అండగా నిలవడానికి ఇక్కడికి వచ్చాను. ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భవిష్యత్తులో మరిన్ని మెట్లు ఎక్కాలని కూడా ఆకాంక్షిస్తున్నాను.. అంటూ అల్లు అర్జున్ మీడియాకు తెలియజేశారు.

బన్నీ రవి కోసం ఒక స్నేహితుడిగా మాత్రమే అతని విజయాన్ని కోరుకున్నట్లు ఈ మాటలతో స్పష్టం అవుతోంది. మొత్తానికి బన్నీ ఎలాంటి రాజకీయ ప్రచారం చేయకుండా రవిచంద్రకు విషెస్ చెప్పి వెనక్కి వచ్చారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. మరో పక్క అల్లు అరవింద్ ఈ రోజు మేనల్లుడు రామ్ చరణ్ తో కలిసి పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిశారు.

Tags:    

Similar News