.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

కల్కి2898ఏడీ… ఐకాన్ స్టార్ ఏమన్నారంటే..

కచ్చితంగా వరల్డ్ వైడ్ గా కల్కి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

Update: 2024-06-30 04:39 GMT

కల్కి 2898ఏడీ మూవీ అద్భుతమైన ఆదరణ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ కల్కి సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్ ని సైన్స్ ఫిక్షన్ కథాంశంతో నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించారని అంటున్నారు. నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. కచ్చితంగా వరల్డ్ వైడ్ గా కల్కి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సినీ ప్రముఖులు సైతం కల్కి మూవీ చూసి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ని ప్రశంసిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు లాంటి స్టార్స్ సినిమా చూసి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలియజేశారు. అలాగే సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ విజువల్ స్పెక్టక్యులస్ గా కల్కి 2898ఏడీ మూవీ ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

అలాగే మూవీలో సూపర్ హీరో పాత్రలో కనిపించిన ప్రభాస్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కమల్ హాసన్ గారి యాక్టింగ్ మరోసారి వెనక్కి ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్లిందని కొనియాడారు. అమితాబ్ బచ్చన్ గారు మీ నటన చాలా ఇన్స్పిరేషన్ కలిగించిందని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. అలాగే దీపికా పదుకునే ఎఫెక్టివ్ పెర్ఫార్మెన్స్, దిశాపటాని గ్లామర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని బన్నీ ట్వీట్ లో పేర్కొన్నారు.

Read more!

ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీకల్ టీమ్ అందరికి పేరుపెరున అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, మ్యాకప్ ఆర్టిస్ట్స్ గొప్పగా వర్క్ చేశారని కొనియాడారు. సాహసం చేసి భారీ బడ్జెట్ తో ఇలాంటి గొప్ప సినిమా చేసిన వైజయంతీ మూవీస్ అశ్వినీ దత్ గారు, స్వప్నదత్, ప్రియాంక దత్ ఇండియన్ మూవీని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకొని వెళ్లారని బన్నీ అన్నారు.

మన జెనరేషన్ వెళ్తున్న రూట్ బ్రేక్ చేసి సరికొత్త మార్గాన్ని కల్కి 2898ఏడీతో సృష్టించిన కెప్టెన్ నాగ్ అశ్విన్ అందరూ తనవైపు తిరిగిచూసేలా చేసుకున్నారని బన్నీ ప్రశంసించారు. మన నాగరిక, సంస్కృతిలో ఉన్ని సున్నితత్వాన్ని డిస్టర్బ్ చేయకుండా అద్భుతంగా కల్కి చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులకి గొప్ప అనుభూతిని కలిగించారని అల్లు అర్జున్ కొనియాడారు. అల్లు అర్జున్ పోస్ట్ పై నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యి కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:    

Similar News