పిక్‌టాక్ : విలేజ్‌లో వినాయకుడు ఇప్పుడు ఇలా..!

గేమ్‌ ఛేంజర్‌తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో కనిపించిన కృష్ణుడు గతంలో మాదిరిగా గుర్తింపు దక్కే స్థాయి పాత్రలను దక్కించుకోలేకపోతున్నాడు.

Update: 2025-02-20 09:51 GMT

2005లో 'మొదటి సినిమా'తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అల్లూరి కృష్టం రాజు/కృష్ణుడు ఇటీవల 'గేమ్ ఛేంజర్‌' సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. కెరీర్‌ ఆరంభంతో పోల్చితే ఈమధ్య కాలంలో కృష్ణుడు చాలా బరువు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు. తాజా లుక్‌లో కృష్ణుడిని చూస్తే రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో కనిపించిన కృష్ణుడు గతంలో మాదిరిగా గుర్తింపు దక్కే స్థాయి పాత్రలను దక్కించుకోలేకపోతున్నాడు. తాజాగా సోషల్‌ మీడియాలో కృష్ణుడు షేర్ చేసిన ఫోటో వైరల్‌ అవుతోంది.


గత కొంత కాలంగా కృష్ణుడు వైకాపాకి సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. వైకాపా తరపున ప్రచారం చేయడం మొదలుకుని, అధినేత వైఎస్ జగన్‌ను కలవడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా మరోసారి వైఎస్‌ జగన్‌ను కృష్ణుడు కలిశాడు. తాను జగన్‌ను కలిసిన ఫోటోను కృష్ణుడు ఎక్స్ ద్వారా షేర్‌ చేశాడు. తాడేపల్లి వెళ్లి జగన్‌ను కలిసిన కృష్ణుడు షేర్‌ చేసిన ఫోటో వైరల్‌ అయింది. ఉన్నట్లుండి ఈ సమయంలో జగన్‌ను కృష్ణుడు ఎందుకు కలిశాడు అంటూ కొందరు కామెంట్‌ చేస్తే, కొందరు మాత్రం కృష్ణుడు చాలా మారాడు అంటూ కామెంట్‌ చేశారు.

వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను హీరోగా చేసిన కృష్ణుడు ఆ తర్వాత తర్వాత కాలంలో కమెడియన్‌గా సినిమాలు చేశాడు. కృష్ణుడు చేసిన సినిమాలు నిరాశ పరచడంతో పాటు, ఆయన పాత్రలకు గుర్తింపు దక్కక పోవడంతో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆఫర్లు సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ అడపా దడపా సినిమాల్లో కృష్ణుడు కనిపిస్తూ వస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మళ్లీ వరుస సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ కృష్ణుడు చెప్పుకొచ్చాడు.

గతంలో తాను 160 కేజీల బరువు ఉండేవాడిని అని, ఇప్పుడు చాలా బరువు తగ్గాను అని కృష్ణుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి కృష్ణుడు ఇండస్ట్రీలో తిరిగి ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చాలానే చేస్తున్న సమయంలో జగన్‌ తో దిగిన ఈ ఫోటో బయటకు రావడంతో లుక్‌ వైరల్‌ అవుతోంది. వినాయకుడు సినిమాలో కృష్ణుడికి ఇప్పుడు కృష్ణుడికి ఎంత మార్పు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కృష్ణుడి కొత్త లుక్‌ బాగుంది, కనుక సినిమాల్లో ఆయన రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్‌ స్వింగ్‌తో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా వరుస సినిమాలు చేయాలని ఆయన్ను అభిమానించే వారు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News