ఆ కారణం తో ఇన్ని సంవత్సరాల గ్యాప్ తీసుకున్నా..కృష్ణుడు
ఈ నేపథ్యంలో తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అన్న విషయాన్ని కృష్ణుడు పేర్కొన్నారు.
సినీ ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్నో సినిమాలు తీసిన గుర్తింపు రాదు..మరి కొంతమందికి తీసిన ఒకటి రెండు సినిమాలతో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. హీరోగా ఎదగాలి అంటే ఫిజిక్ ఎంతో ముఖ్యం. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆకారంతో సంబంధం లేదు అంటూ.. తన స్టైల్ మూవీస్ తో ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు కృష్ణుడు. వరుస చిత్రాలతో బాగా ఎంటర్టైన్ చేస్తున్న సమయంలో సడన్గా అతను సినిమాలో తీయడం ఆపేశాడు. ఇప్పుడు ఏడు సంవత్సరాల సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో తాను సినిమాలకు ఎందుకు దూరం అయ్యాను అన్న విషయాన్ని కృష్ణుడు పేర్కొన్నారు.
సినీ అభిమానులకు కృష్ణుడు పేరుతో పరిచయమైన ఈ యాక్టర్ అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. గంగోత్రి చిత్రంతో తన కెరీర్ ను ప్రారంభించిన కృష్ణడు.. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు.
హ్యాపీడేస్, వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న కృష్ణుడు ఇప్పుడు వరుస సినిమాలతో తిరిగి బిజీ అయిపోయాడు. ఇక దీని వెనక అసలు విషయాన్నీ తాజాగా ఆయన పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు.
‘నేను ఏ సినిమాలో చేసిన నన్ను వినాయకుడు అనే పిలుస్తూ వచ్చారు. ఛాలెంజింగ్ గా ఉండే రోల్స్ ఏవి నా వద్దకు రావడమే లేదు. రొటీన్ గా ఒకే తరహా పాత్రలో నటించడం నాకు బాగా విసుగుగా అనిపించింది. నేను 160 కేజీల బరువు ఉండడంతో నాకు అన్ని అదే తరహా పాత్రలు ఇవ్వడం ఏదో ఇచ్చిన పాత్ర చేయడం నాకు నచ్చలేదు.అందుకే నేను ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. నాకు ఇష్టమైన పనులను చేస్తూ.. టూర్స్ కి వెళ్తూ.. నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడపాను.’ అని కృష్ణుడు సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం వెల్లడించారు. ప్రస్తుతం బాగా బరువు తగ్గిన కృష్ణుడు.. త్వరలో విడుదల కాబోతున్న రామ్ చరణ్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్నారు.