ఓటీటీ : మెగా మూవీతో ఇంకా చాలా..!

ప్రతి వారం థియేటర్ల ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి.

Update: 2024-08-26 11:12 GMT

ప్రతి వారం థియేటర్ల ద్వారా పెద్ద ఎత్తున సినిమాలు వస్తున్నాయి. ఏదో ఒక భాష లో పెద్ద హీరోల సినిమాలు కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా థియేటర్లలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా వస్తున్న దాఖలాలు లేవు. అయినా కూడా సినిమాల సంఖ్య తగ్గడం లేదు. వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాలు వారానికి రెండు మూడు అంతకు మించి కూడా వస్తున్నాయి. ఇక పెద్ద సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. థియేటర్ రిలీజ్ మాదిరిగానే ఓటీటీ స్ట్రీమింగ్‌ కూడా ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తున్నాయి.

థియేటర్‌ రిలీజ్ లకు ఏమాత్రం తగ్గకుండా వెబ్‌ షో లు, వెబ్‌ మూవీస్, వెబ్‌ సిరీస్ లు ప్రతి వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తున్నాయి. గత వారం తెలుగు తో పాటు ఇతర భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు, వెబ్‌ షోలు స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఇక ఈ వారం కూడా ఏమాత్రం తగ్గకుండా పెద్ద ఎత్తున సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్నాయి. తెలుగు నుంచి మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కు రెడీ గా ఉంది.

ఇటీవల విడుదల అయిన బడ్డీ మూవీ కి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు అనేది బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌. ఇదే సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయితే కచ్చితంగా మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని యూనిట్‌ సభ్యులు భావించి వెంటనే స్ట్రీమింగ్‌ కు రెడీ చేస్తున్నారు. ఈ వారంలోనే స్ట్రీమింగ్‌ చేయడం ద్వారా ఎక్కువ లాభం పొందాలని నెట్‌ ఫ్లిక్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు నుంచి మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో రావచ్చు.

బ్రెజిల్ జాతీయ హీరోగా మారిన ఫార్ములా 1 రేసర్‌ కథతో రూపొందిన సీన ను ఈనెల 29న నెట్‌ ప్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఐసీ814 : ది కాందహార్ హైజాక్ ను నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఇంకా పలు ఇంగ్లీష్ మరియు ఇతర సినిమాలు వెబ్‌ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కు రెడీ అవుతున్నాయి. ఇక థియేటర్ల ద్వారా ఈ వారంలో నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా కూడా రాబోతుంది. ఆ సినిమా తో పాటు ఓటీటీ స్ట్రీమింగ్‌ మూవీస్ తో ప్రేక్షకులు ఈవారం పండగే పండగ.

Tags:    

Similar News