అల్లు స్నేహ రెడ్డి.. ఫిట్నెస్ తో షాక్ ఇచ్చేలా..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సతీమణులు ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచంలో కూడా మంచి క్రేజ్ అందుకుంటూ ఉన్నారు

Update: 2024-03-01 08:21 GMT

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సతీమణులు ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచంలో కూడా మంచి క్రేజ్ అందుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా అందమైన హీరోయిన్స్ తరహాలో వారికి కూడా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో ఫాలోవర్స్ ను గట్టిగానే పెంచుకుంటున్నారు.

ఆమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. స్నేహారెడ్డి మొదట్లో అల్లు అర్జున్ కు సంబంధించిన ఫోటోలు అలాగే పిల్లలు అల్లు అర్హ అయాన్ లకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఇక తర్వాత ఆమె కూడా అందమైన ఫోటోలతో మరింతగా ఆకట్టుకుంటూ ఉన్నారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి ఫిట్నెస్ తో కూడా ఆశ్చర్య పరుస్తూనే ఉన్నారు.

స్నేహారెడ్డి ఎక్కువగా యోగ జిమ్ వర్కౌట్స్ పై ఆసక్తి ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెబుతున్నారు. రీసెంట్గా మరోసారి ఆమె గార్డెన్ ఏరియాలో జిమ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అలాగే యోగా కూడా చేస్తున్నట్లు తెలిపారు. స్నేహ రెడ్డి తన మంచి ఫిట్నెస్ కు రహస్యం ఇదే అని చెప్పకనే చెప్పేశారు. ఇక అల్లు అర్జున్ కూడా ఫిట్నెస్ తోనే ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఆయన సతీమణి కూడా అదే బాటలో కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఆ మధ్య అల్లు స్నేహారెడ్డి సినిమాల్లోకి కూడా రాబోతోంది అన్నట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే ఆ విషయంలో ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ మోడల్ గా కూడా ఆమె అడుగులు వేస్తున్నట్లు మరోసారి వార్తలు అయితే వస్తున్నాయి. మరి స్నేహ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇక వారి పిల్లలకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్హ తన అల్లరి వీడియోలతో ఇప్పటికే ఫ్యాన్ ను ఫాలోవర్స్ గట్టిగా పెంచేసుకుంది. ఇక అల్లు అయాన్ కూడా బన్నీ తరహాల్లోనే చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు అని కొన్ని వీడియోలు రుజువు చేశాయి. ఇప్పటికే అల్లు అర్హ శాకుంతలం ద్వారా వెండితెరపై కనిపించింది. ఇక అల్లుఅర్జున్ ఎప్పుడూ ఎంట్రీ ఇస్తాడో కాలమే సమాధానం చెప్పాలి.

Tags:    

Similar News