పొట్టి దుస్తుల్లో అమ‌లాపాల్..ఇది యువ‌త‌కి సందేశం!

సినిమా ప్ర‌చారంలో భాగంగా హీరోయిన్లు అంతా వివిధ వేదిక‌ల‌పై హాజ‌ర‌య్యేందుకు న‌చ్చిన దుస్తులు ధ‌రిస్తుంటారు.

Update: 2024-07-26 08:04 GMT

సినిమా ప్ర‌చారంలో భాగంగా హీరోయిన్లు అంతా వివిధ వేదిక‌ల‌పై హాజ‌ర‌య్యేందుకు న‌చ్చిన దుస్తులు ధ‌రిస్తుంటారు. ర‌క‌ర‌కాల మోడ్ర‌న్ దుస్తుల్లో క‌నిపిస్తుంటారు. వీలైనంత వ‌రకూ చాలా మంది హీరోయిన్లు అందాల్ని హైలైట్ చేసేలా చూసుకుంటారు. డిజైన‌ర్ దుస్తుల పేరిట స్పాట్లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో కెమారాకి ఫోజులిస్తుంటారు. ప్ర‌చార ప‌రంగా ఓ హీరోయిన్ గా అవ‌స‌రం కాబట్టి ఇలా క‌నిపిస్తుంటారు.

తాజాగా అమ‌లా పాల్ త‌న సినిమా ప్ర‌చారం కోసం ఎర్నాకుళం లోని ఓ కాలేజీలో ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ వెంట్ కోసం అమ‌లాపాల్ న‌లుపురంగు స్క‌ర్ట్ ధ‌రించి హాజ‌రైంది. ఇందులో అమ్మ‌డు గ్లామ‌ర్ డాల్ గానే హైలైట్ అవుతుంది. అయితే ఈ ఫోటోపై నెట్టింట పెద్ద చ‌ర్చేసాగింది. కాలేజీ ఈవెంట్ కోసం ఇలాంటి దుస్తుల్లో హాజ‌రై యువ‌త‌కి ఏ ర‌క‌మైన సందేశం ఇస్తున్నార‌ని నెటిజ‌నులు మండిప‌డుతున్నారు.

ప‌ద్ద‌తైన దుస్తుల్లో క‌నిపిస్తే సినిమాకి ప్ర‌చారం రాదా? అని అడుగుతున్నారు. విద్యాసంస్థ‌ల ఈవెంట్లో ప‌ద్ద‌తిగా క‌నిపించాల‌నే జ్ఞానం లేదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఈ విమ‌ర్శ‌ల‌పై అమ‌లాపాల్ స్పందించింది. `ఈ డ్రెస్ లో నేనెంతో సౌక‌ర్యంగా ఉన్నాను. ఇలాంటి డ్రెస్ లో అక్క‌డికి వెళ్ల‌డం నాకేమంత్రం త‌ప్పు గా అనిపించ‌లేదు. అయితే అక్క‌డ నా ఫోటోలు ఎలా తీసారు? అన్న‌ది స‌మ‌స్య‌గా ఉంది.

ఆ దుస్తుల్లో విద్యార్దులు చూసి ఎలాంటి ఇబ్బంది ప‌డ‌లేదు. డ్రెస్ ఎంపిక‌లో విద్యార్ధుల ఆత్మ‌స్తైర్యం నింపేదుకే అక్క‌డ‌కు అలాంటి డ్రెస్ వేసుకున్నా. ఇందులో నాకెలాంటి త‌ప్పు క‌నిపించ‌లేదు` అని అంది. ఇక అమ‌లాపాల్ గ‌త నెల‌లో ఓబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. 2023 లో జ‌గ‌త్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఎల్ విజ‌య్ ని వివాహం చేసుకుంది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్ద‌ల‌తో ఏడాది కాలంలోనే విడిపోయారు.

Tags:    

Similar News