అమ‌లాపాల్ పెళ్లి త‌ర్వాత అదే దూకుడు!

విజ‌య్ స‌హా అత‌ని తండ్రితో ఈ విష‌యంలోనే అభిప్రాయ బేధాలు రావ‌డంతో విడిపోయిన‌ట్లు వినిపిం చింది

Update: 2023-11-07 02:45 GMT

అమ‌లాపాల్ రెండ‌వ పెళ్లితో మ‌ళ్లీ కొత్త జీవితం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. వ్యాపార వేత్త జ‌గ‌త్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టింది. అయితే అమ్మ‌డు ఇక‌పై కెరీర్ ని ఎలా ప్లాన్ చేసింది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. న‌టిగా సినిమాలు కొన‌సాగిస్తుందా? వివాహ బంధంతో పుల్ స్టాప్ పెడుతుందా? అన్న ఓ డౌట్ రెయిజ్ అవుతుంది. గ‌తంలో మొద‌టి భ‌ర్త ఏ.ఎల్ విజ‌య్ కుటుంబంతో సినిమాల విష‌యంలో వివాదం త‌లెత్త‌డంతో విడిపోయిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

విజ‌య్ స‌హా అత‌ని తండ్రితో ఈ విష‌యంలోనే అభిప్రాయ బేధాలు రావ‌డంతో విడిపోయిన‌ట్లు వినిపిం చింది. అయితే అందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గత్ దేశాయ్ తో వివాహం త‌ర్వాత సినిమాలు కొన‌సాగిస్తుందా? లేదా? అన్న‌ది స‌స్ప‌న్స్. ఇద్ద‌రు చాలా కాలంగా మంచి స్నేహితు లుగా కొన‌సాగుతున్నారు. దీంతో ఆ స్నేహం ప్రేమ‌గా మారింది. ముందుగా అమ‌లాపాల్ కి జ‌గ‌త్ దేశాయ్ ప్ర‌పోజ్ చేసాడు.

ఈ విష‌యాన్ని అత‌ను ఎంతో సంతోషంగా నా క‌ల‌ల రాణి నాకు ఎస్ చెప్పింది అంటూ సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు. అమ‌లాపాల్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆ విష‌యం పంచుకుని నెల రోజులు కూడా గ‌డ‌వకుండానే వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం అమ‌లాపాల్ న‌టిగా రెండు..మూడు సినిమాలు చేస్తోంది. అవి రెండు మాతృ భాష‌ మ‌ల‌యాళంలోనే. వాటిలో దివిజ అనే సినిమా షూటింగ్ పూర్త‌యింది.

మ‌రో సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. మ‌రి వీటి త‌ర్వాత అమ‌లాపాల్ సినిమాలు కొన‌సాగిస్తుందా? కొన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుంటుందా? ప్రోపెష‌న‌ల్ న‌టిగా య‌ధావిధిగా కొన‌సాగుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. అలాగే లావ‌ణ్య త్రిపాఠి కూడా మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆమె కూడా సినిమాలు కొన‌సాగిస్తుందా? మెగా కోడ‌లిగా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News