వైఫల్యం గురించి ఓపెన్గా డైరెక్టర్!
'స్త్రీ', 'బాలా' లాంటి సక్సెస్ ల తర్వాత 'బేదియా' రిలీజ్ అవ్వడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి.;

తక్కువ బడ్జెట్ లో బ్లాక్ బస్టర్లు ఇవ్వడంలో బాలీవుడ్ డైరెక్టర్ అమర్ కౌశిక్ స్పెషాల్టీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'స్త్రీ', 'బాల',' స్త్రీ-2', 'మూంజ్యా' లాంటి బ్లాక్ బస్టర్లతో అమర్ కౌశిక్ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. డైరెక్టర్ గా చేసింది నాలుగు సినిమాలే అయినా? తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను దక్కించుకున్నారు. అయితే ఈ రేసులో 'బేదియా' మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది.
'స్త్రీ', 'బాలా' లాంటి సక్సెస్ ల తర్వాత 'బేదియా' రిలీజ్ అవ్వడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నారంతా. కానీ ఆ రేంజ్ లో అంచనాలు అందుకోలేదు. 'బేదియా' రిలీజ్ సమయంలో బాలీవుడ్ నుంచి 'దృశ్యం 2' కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
'బేధియా' మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా వైఫల్యం గురించి అమర్ కౌశిక్ తొలిసారి ఓపెన్ అయ్యాడు. 'బేదియా' వైఫల్యాన్ని ఆయన అంగీకరించాడు. `దృశ్యం2` రిలీజ్ సమయానికి భారీ బజ్ ఉంది. కానీ మా సినిమాకి ఆ స్థాయిలో లేదు. దీంతో థియేటర్లను ఆక్యుపై చేయ డంలో 'దృశ్యం2' సక్సెస్ అయింది. అప్పుడు పరీక్షల సీజన్ కావడంతో? ఆ ప్రభావం కూడా సినిమాపై పడిందన్నారు.
క్రియేటివ్ పరంగా సినిమాకు అంతగా కలిసి రాలేదని రిలీజ్ తర్వాత రియలైజ్ అయ్యాం. కొంత మంది ఆడియన్స్ మాత్రమే కనెక్ట్ అవ్వగలిగారు. ప్రేక్షకుల ఆలోచనలకు భిన్నంగా వెళ్లడం సినిమా ఫలితంపై ప్రతికూలంగా మారిందన్నారు. బేదియా థియేట్రికల్ గా ఫెయిలైనప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది.