విజయ్, రజినీ రికార్డు బ్రేక్ చేసిన శివ కార్తికేయన్

ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

Update: 2024-11-01 05:59 GMT

కోలీవుడ్‌కు చెందిన హీరోల్లో కొంత మందికి మాత్రమే తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందులో యంగ్ హీరో శివకార్తికేయన్ ఒకరు. ఈ మధ్య కాలంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన అతడు.. ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ వంటి చిత్రాలతో తెలుగులోనూ విజయాలు అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత పలు చిత్రాలను చేసినా మెప్పించలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో శివ కార్తికేయన్ నటించిన చిత్రమే ‘అమరన్’.

మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘అమరన్’ సినిమాను రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే శివ కార్తికేయన్ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీనికి ఆరంభంలోనే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మౌత్ టాక్ కూడా లభించింది.

శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ సినిమాకు టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు అదిరిపోయే స్పందన లభించింది. దీంతో ఈ చిత్రానికి రూ. 34 కోట్లకు పైగా వసూళ్లు సొంతం అయ్యాయి. అందులో తమిళనాడులోనే రూ. 17.70 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్లు ఇతర ప్రాంతాల్లొ రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లు రాబట్టింది. దీంతో శివ కార్తికేయన్ కెరీర్‌లోనే టాప్ మూవీల్లో ఒకటిగా ఇది నిలిచింది.

ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన ‘అమరన్’ సినిమాకు అన్ని ఏరియాల కంటే తమిళనాడులో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదల రోజు బుక్ మై షోలో ఒక గంట వ్యవధిలోనే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన చిత్రాల లిస్టులో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.

విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీకి ఒక గంటలో 32.16 వేల టికెట్స్ అమ్ముడుపోగా.. ‘అమరన్’ సినిమా టికెట్స్ గంటలో 32.57 వేలు ఫినీష్ అయిపోయాయి. ఈ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయన్’ 31.86 వేల టికెట్స్ అమ్మకంతో మూడో స్థానంలో, కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమా 25.78 వేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అలా మీడియం రేంజ్ హీరో స్టార్ హీరోల రికార్డులను కొట్టేసినట్లైంది.

ఇక, శివ కార్తికేయన్ - రాజ్‌కుమార్ పెరియస్వామి కాంబినేషన్‌లో రూపొందిన ‘అమరన్’ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లపై కమల్ హాసన్, మహేంద్రన్, వివేక్‌లు నిర్మించారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా చేయగా.. భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీ కుమార్ తదితరులు నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు.

Tags:    

Similar News