అమరన్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే?
ఇదిలా ఉంటే ఈ సినిమాకి తెలుగులో 7 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. శివ కార్తికేయన్ ఇమేజ్ పరంగా చూసుకుంటే తెలుగులో మంచి బిజినెస్ అని చెప్పొచ్చు.
శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా తమిళంలో తెరకెక్కిన మూవీ 'అమరన్' తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. రియల్ లైఫ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ పెరిస్వామి తెరకెక్కించారు. మేజర్ ముకుందన్ వరదరాజన్ జీవిత కథగా ఈ థియేటర్స్ లోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మూవీ ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది.
ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో చాలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి తెలుగులో 7 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అయ్యిందని తెలుస్తోంది. శివ కార్తికేయన్ ఇమేజ్ పరంగా చూసుకుంటే తెలుగులో మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. మూవీ కమర్షియల్ హిట్ కావాలంటే 8 కోట్ల షేర్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ కలెక్షన్స్ ని ఈజీగా అందుకుంటుంది.
ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఏకంగా 65 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. శివ కార్తికేయన్ కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ జరిగిన చిత్రంగా అమరన్ నిలిచింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకొని హిట్ టాక్ తెచ్చుకోవాలంటే 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తే మాత్రం కచ్చితంగా శివ కార్తికేయన్ ఇమేజ్ పెరిగినట్లేనని చెప్పొచ్చు.
తమిళంలో అయితే ఈ చిత్రానికి భారీ వసూళ్లు గ్యారెంటీ అనుకుంటున్నారు. అక్కడ 'అమరన్' కి పోటీగా మరో సినిమా లేదు. వచ్చిన చిన్న సినిమాలు అమరన్ కలెక్షన్స్ పై ప్రభావం చూపకపోవచ్చని అనుకుంటున్నారు. తమిళ్ ఆడియన్స్ ముందుగా ప్రాంతీయ భాషా చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తారు.
వాటి తర్వాత ఇతర భాషల నుంచే వచ్చే డబ్బింగ్ మూవీస్ ఓటు వేస్తారు. పాన్ ఇండియా రేంజ్ లో అమరన్ రిలీజ్ అవుతోంది. ఆర్మీ ఆఫీసర్ కథతో వస్తోంది కాబట్టి కచ్చితంగా అన్ని భాషలలో మూవీ ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. హిందీలో 'సింగం అగైన్', 'భూల్ భూలయ్యా 3' సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'అమరన్' బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే హిందీ సినిమాలతో పోటీ పడే ఛాన్స్ ఉంటుంది.