ఆకాశంలో 7-స్టార్ హోటల్.. అంబానీ 1000కోట్ల జెట్ ప్ర‌త్యేక‌త‌!

ఈసారి భారతదేశంలో ఎవ‌రూ సొంతం చేసుకోలేని సరికొత్త ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.;

Update: 2025-03-29 12:25 GMT
ఆకాశంలో 7-స్టార్ హోటల్.. అంబానీ 1000కోట్ల జెట్ ప్ర‌త్యేక‌త‌!

ప్ర‌పంచంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ మరోసారి తన విలాసవంతమైన జీవనశైలితో వార్తల్లో నిలుస్తున్నాడు. ఈసారి భారతదేశంలో ఎవ‌రూ సొంతం చేసుకోలేని సరికొత్త ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంబానీ కొనుగోలు చేసిన‌ అల్ట్రా లగ్జరీ విమానం- బోయింగ్ 737 MAX 9 ఇప్పటికే భారతదేశానికి చేరుకుంది. ఇప్ప‌టికే ఉన్న‌ ప్రైవేట్ జెట్‌ల గ్యారేజీలోకి ఈ కొత్త జెట్ అదనంగా చేరుతోంది.

రూ.1,000 కోట్ల ఖరీదు చేసే బోయింగ్ 737 MAX 9 విమానం.. బాసెల్, జెనీవా, లండన్‌లలో కఠినమైన విమాన పరీక్షలను నిర్వహించిన తర్వాత ఆగస్టులో భారతదేశానికి చేరుకుంది. ఈ జెట్‌ను అమెరికా వాషింగ్టన్‌లోని రెంటన్‌లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో అసెంబుల్ చేశారు. మొదట 2022లో డెలివరీ చేయాలని షెడ్యూల్ చేసినా కానీ.. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ ఆలస్యం అయింది. అయితే ఇది ఇప్పుడు అంబానీ గ్యారేజీకి చేరుకుంది, భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9కి యజమానిగా ఆయన నిలిచారు.

ఆస‌క్తిక‌రంగా ఇది అంబానీ కుటుంబం త‌మ‌ అభిరుచులకు అనుగుణంగా రీడిజైన్ చేయించారు. ఈ ప్రత్యేకమైన జెట్ మోడల్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ మాత్ర‌మే.

బోయింగ్ సువిశాలమైన క్యాబిన్, పెద్ద కార్గో సామర్థ్యం .. అత్యాధునిక ఫీచ‌ర్స్ తో ఈ విమానం ఆకాశంలో 7-స్టార్ హోటల్ గా పిలుపందుకుంటోంది. ఈ జెట్ రెండు CFMI LEAP-1B ఇంజిన్‌లతో శక్తినిస్తుంది. ఇది ఒకే ప్రయాణంలో 11,770 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఈ కొత్త జెట్ చేరిక‌తో ముఖేష్ అంబానీ ఇప్పటికే తొమ్మిది ఇతర ప్రైవేట్ జెట్‌లను కలిగి ఉన్నారు. వాటిలో బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135 , రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు వంటి విమానాలు ఉన్నాయి. రూ. 9 లక్షల కోట్లకు పైగా సంపదతో, ముఖేష్ అంబానీ అసమానమైన విలాసం దుబారాతో నిండిన జీవితాన్ని కొనసాగిస్తూ, సంపన్న జీవితాన్ని గడపడం అంటే ఏమిటో ప్ర‌త్య‌క్షంగా చూపిస్తున్నారు.

Tags:    

Similar News