అమీర్‌ఖాన్ లవ్‌స్టోరీస్ ఇది గమనించారా?
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ పేరు తెచ్చుకున్న అమీర్‌ఖాన్ కెరీర్ పరంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.;

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ పేరు తెచ్చుకున్న అమీర్‌ఖాన్ కెరీర్ పరంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. విభిన్నమైన కథలతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన అమీర్ ఖాన్ హీరోగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. `దంగల్`తో రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సూపర్ స్టార్‌గా రికార్డు సృష్టించిన ఆయన `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` నుంచి ఫ్లాప్‌లని ఎదుర్కొంటూ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు.
ఈ మూవీ తరువాత మూడేళ్లు విరామం తీసుకుని చేసిన హాలీవుడ్ రీమేక్ `లాల్ సింగ్ చద్దా` కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి షాక్ ఇచ్చింది. దీంతో ఆలోచనలో పడ్డ అమీర్ ఖాన్ తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. `లాల్ సింగ్ చద్దా` విడుదలై రెండేళ్లుకు పైనే అవుతున్న నేపథ్యంలో తాజాగా సోలో హీరోగా ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో `సితారే జమీన్ పర్` అనే మూవీకి శ్రీకారం చుట్టారు. `తారే జమీన్ పర్` కు సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీని 2018లో విడుదలైన ఫ్రెంచ్ మూవీ `ఛాంపియన్` ఆధారంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో డేటింగ్‌కి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. 1996లో హిందూ నటి రీనా దత్తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఆ తరువాత అభిప్రాయ బేధాలు రావడంతో ఆమెకు 2002లో విడాకులిచ్చారు. మూడేళ్ల విరామం తరువాత 2005లో మరో హిందూ లేడీ కిరణ్ రావుని ప్రేమ వివాహం చేసుకోవడం తెలిసిందే.
తనకు కూడా 2021లో విడాకులిచ్చాడు. అప్పటి నుంచి రిలేషన్‌షిప్‌కు దూరంగా ఉంటూ వచ్చిన అమీర్‌ఖాన్ తాజాగా మరో హిందూ మహిళ తో గత కొంత కాలంగా అమీర్ వద్ద పని చేస్తున్న గౌరీ స్ప్రత్‌తో తాను డేటింగ్‌లో ఉన్నానని అమీర్‌ఖాన్ ఇటీవల తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. 25 ఏళ్లుగా గౌరీతో స్నేహాన్ని కలిగిఉన్న అమీర్ ఇప్పుడు తనతో డేటింగ్ చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే అమీర్ డేటింగ్ చేయడానికి, పెళ్లికి హిందూ మహిళలే ఎందుకు ఎదురవుతున్నారని నెటిజన్‌లు వాపోతున్నారు. ఈ లవ్ స్టోరీస్ తమకు అర్థం కావడం లేదని కామెంట్‌లు చేస్తున్నారు.