అమితాబచ్చన్ కి కరెంట్ షాక్!
`యారన్` సినిమాలో `సారా జమానా` అనే హిట్ సాంగ్ ఒకటుంది.
బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ కి కరెంట్ షాక్ కొట్టిందా? అలంకరణలో భాగంగా శరీరానికి తగిలించిన జాకెట్ కారణంగానే ఆ పరిస్థితి తలెత్తిందా? అంటే అవుననే తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్లే... లెజెండరీ నటుడు అమితాబచ్చన్ ఇప్పటికీ కౌన్ బనేగా కరోడ్పతీ షోను సక్సెస్ పుల్ గా హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో వేదికగా ఆయన కంటెంస్టెంట్ తో పాటు లైవ్ లో ఉన్న ప్రేక్షకులతో తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తుంటారు. ఈనేపథ్యంలో కరెంట్ షాక్ విషయాన్ని కూడా పంచుకున్నారు.
`యారన్` సినిమాలో `సారా జమానా` అనే హిట్ సాంగ్ ఒకటుంది. ఆ పాటని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేను సలహా ఇచ్చాను. ఆ సమయంలోనే కోల్ కత్తాలో సుభాష్ చంద్రబోస్ స్టేడియం ఓపెన్ చేసారు. అందులో 15 వేల నుంచి 20 వేల మంది కూర్చునే సామర్ధ్యం ఉంది. కానీ 50 నుంచి 60 వేల మంది వచ్చారు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్లిపోయాం.
ఆ తర్వాత ఓ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా రాత్రి పూట షూట్ చేద్దామని వెళ్లాం. అప్పుడు సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదు. కూర్చిలో జనాలు కూడా లేరు కాబట్టి. ఆ ప్లేస్ కొవ్వొత్తుల వెలిగించి పెట్టాం. నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తగిలించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా వృద్దిలో లేదు కాబట్టి అన్నిపాట్లు పడాల్సి వచ్చింది. నా జాకెట్ కి లైట్స్ వెలగాలంటే ప్లెగ్ పెట్టి స్విచ్చాన్ చేయాలి.
అలా చేయగా వెంటనే నాకు షాక్ తగిలింది. దీంతో ఆటో మేటిక్ గా నాలో మూవ్ మెంట్ మొదలైంది. ఆ కాసేపటికి టెక్నీషియన్ వచ్చి వైర్ తప్పించి సవ్యంగా చేయడంతో ఆ పాట షూట్ చేయగలిగాను. కరెంట్ షాక్ తగిలితే ఎలా ఉంటుంది? అన్నది అప్పుడే తెలిసింది. అంతవరకూ నాకు ఎలాంటి కరెంట్ షాకులు తగలలేదు` అని అన్నారు.