అందుకే ఈ వయసులో కూడా సినిమాలు చేస్తున్నా ?
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబచ్చన్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబచ్చన్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా అతడు ఎదిగిన విధానం ఎంతో మందికి స్పూర్తి. అతనితో సినిమాలు చేయాలని దర్శకులు అయింది మరెంతో మంది. అతడి స్పూర్తితో ఇండస్ట్రీకి నటులుగా ఎదిగిన వారు ఎంతో మంది. ఇక అమితాబ్ నట వారసత్వంతో అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వడం..అతడు సక్సెస్ పుల్ గా జర్నీ సాగించడం తెలిసిందే. అలాగని అమితాబ్ రిలాక్స్ అవ్వలేదు.
అవకాశాలు వచ్చిన అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రధాన పాత్రలే కాకుండా అన్ని సినిమాల్లోనూ కీలక పాత్రలు సైతం చేస్తున్నారు. ఇటీవలే కల్కి 2898 లోనూ యాక్షన్ స్టార్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తీసిందే అమితాబ్ కోసం అన్నంతగా ఫేమస్ అయ్యారు. అందులో పేరుకే ప్రభాస్ హీరోగానీ...అసలైన హీరో మాత్రం అమితాబ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. 81 ఏళ్ల వయసులోనూ ఆయన ఎంతో యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు.
అందుకు సంతోషించే అభిమానులు కొందరైతే? చూసి కుళ్లుకునే వర్గం కూడా ఉంది. కొంత మంది ఈ వయసులో కూడా సినిమాలు అవసరమా? సంపాదించిన ఆస్తులు సరిపోలేదా? వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవచ్చు కదా? అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ విమర్శలపై అమితాబ్ స్పందించారు. `విమర్శల గురించి కాదీ నాఈ సమాధానం. ఎందుకు పనిచేస్తున్నారని ఇప్పటికీ నన్ను సెట్లో అడుగుతుంటారు.
దీనికి నా దగ్గర సమాధానం లేదు. కానీ సినిమా అనేది నాకు ఓ ఉద్యోగం లాంటింది. ఉదయాన్నే లేచి రెడీ అయి టిఫిన్ చేసి అందరూ ఆఫీస్ కి ఎలా వెళ్తారో? నేను కూడా నా పనికి రోజూ వెళ్లాల్సిందే. ఈ పని నిరంతరం చేసుకుంటూ వెళ్లడమే. నా పని నేను చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఇది నా కారణం. దానికి మీరంతా ఏకీభవిస్తారా? లేదా? అన్నది మీ ఇష్టం. మీరు ఎలా తీసుకున్నా నాకెలాంటి అభ్యంతరం లేదు` అన్నారు.