ఫోటో స్టోరి: అమీ జాక్సన్ బాస్ వైబ్స్
అయితే ఎమీ నీలి కళ్ళు స్మోకీ గా మెరిసే కాంస్య ఐషాడోతో నిండి ఉన్నాయి. పింకీ న్యూడ్ లిప్‌స్టిక్‌తో నిండిన మాట్ లే రూజ్ లిక్విడ్ అదనపు ఆకర్షణ.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందగత్తెల సందడి గురించి తెలిసిందే. ఈ వేడుకల్లో బ్రిటీష్ మోడల్ కం నటి ఎమీజాక్సన్ డిజైనర్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. పాపులర్ హాలీవుడ్ దర్శకుడు కెవిన్ కాస్ట్నర్ దర్శకత్వం వహించిన `హారిజన్: యాన్ అమెరికన్ సాగా` చిత్రం ప్రీమియర్‌కు రితీష్, మోడల్ కం నటి అమీ జాక్సన్ ఇటీవల హాజరై అద్భుతమైన ఫ్యాషన్ మూమెంట్ తో అలరించారు. అమీ బ్లాక్ గౌనులో రెడ్ కార్పెట్ మీద నడిచింది.
అమీజాక్సన్ అధునాతన రూపం అహూతులను మైమరిపించింది. పరిపూర్ణ సింఫొనీ లుక్ లో యువరాణిని తలపించిందంటూ అభిమానులు ప్రశంసించారు. ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ ఆఫ్ షోల్డర్ గౌను దక్షిణాసియా లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ సిరివన్నవారి ఆటం-వింటర్ 2024-2025 కలెక్షన్స్ నుండి ఎంపిక చేసినది. బ్లాక్ మోయిరే సిల్క్ గౌనులో ఆఫ్-ది-షోల్డర్ స్టైల్ నడుము వద్ద కట్ అవుట్.. ముందు భాగంలో ఒక కీహోల్ ఇవన్నీ ఎమీ ఫ్యాషన్ అండ్ లుక్ లో భాగం. ముఖ్యంగా గౌన్ పైభాగంలో ఉబ్బిన ఆర్గాన్జా స్లీవ్‌లు మేఘాల వలె భుజం చుట్టూ విప్పారడం మరో హైలైట్. క్లాసిక్ మోనోక్రోమటిక్ గౌను చమత్కారమైన అల్లికలు ఆకర్షించాయి. ఎమీ డైమండ్ చెవిపోగులు, నెక్లెస్, చోపార్డ్ నుండి ఉంగరాలు ఎంతగానో ఆకర్షించాయి.
అమీ జాక్సన్ మేకప్ క్రియేటివ్ డైరెక్టర్ సర్ జాన్ చేశారు. ఆ కనుబొమ్మలు చక్కగా మెరుస్తూ కనిపించడం వెనక అతడి కృషి మరువరానిది. అయితే ఎమీ నీలి కళ్ళు స్మోకీ గా మెరిసే కాంస్య ఐషాడోతో నిండి ఉన్నాయి. పింకీ న్యూడ్ లిప్‌స్టిక్‌తో నిండిన మాట్ లే రూజ్ లిక్విడ్ అదనపు ఆకర్షణ.
ఈ సంవత్సరం కేన్స్‌లో పాపులర్ స్టార్లు రెడ్ కార్పెట్‌పై డ్రమాటిక్ లుక్స్‌లో నడుస్తున్నారు కానీ అభిమానులు, ఫ్యాషన్ విమర్శకులపై సరైన ప్రభావం చూపడానికి కష్టపడుతున్నారు. మచ్చలేని రెడ్ కార్పెట్ గ్లామర్‌ను సాధించే విషయంలో అమీ మెరిసే, కాంస్య మోనోక్రోమ్ లుక్ నిజంగా ఒక ఆకర్షణగా మారింది. 2.0 తర్వాత తమిళం- తెలుగు ఆడియెన్ ముందుకు సరైన సినిమాతో రాలేకపోయింది ఎమీజాక్సన్. ఇతర చిన్న హీరోలతో కనిపించిన సినిమాలేవీ ఆశించినంతగా ఆడలేదు.